- Telugu News Photo Gallery Cinema photos Actress rukmini vasanth getting big offers in Tollywood and kollywood
రుక్మిణి వాకిట ఆఫర్ల క్యూ.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్న సొగసరి
రుక్మిణి వసంత్ తన నటనా జీవితాన్నివెండితెరతో ప్రారంభించింది . RADAలో శిక్షణ పొందిన తర్వాత చలనచిత్రాల్లోకి అడుగుపెట్టింది. ఆమె కన్నడ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది. బిర్బల్ ట్రిలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని (2019) ఈ ముద్దుగుమ్మ తొలి కన్నడ చిత్రం, ఇందులో జాన్వి పాత్రలో నటించి గుర్తింపు పొందింది
Updated on: May 22, 2025 | 2:00 PM

రుక్మిణి వసంత్ ఈ ముద్దుగుమ్మ పేరు ఈ మధ్య టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. ప్రధానంగా ఈ అమ్మడు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో చేస్తుంది. ఇప్పుడు తమిళం, తెలుగు సినిమాలలో కూడా అడుగుపెట్టింది.

రుక్మిణి వసంత్ తన నటనా జీవితాన్నివెండితెరతో ప్రారంభించింది . RADAలో శిక్షణ పొందిన తర్వాత చలనచిత్రాల్లోకి అడుగుపెట్టింది. ఆమె కన్నడ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది.

బిర్బల్ ట్రిలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని (2019) ఈ ముద్దుగుమ్మ తొలి కన్నడ చిత్రం, ఇందులో జాన్వి పాత్రలో నటించి గుర్తింపు పొందింది అలాగే సప్త సాగరాలు దాటి సినిమాలో నటించింది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రియా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఆమెకు ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ)ను తెచ్చిపెట్టింది.

ఆతర్వాత కన్నడలో బానదారియల్లి, భైరతి రణగల్, బఘీరా వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో నటిస్తోంది. ఏస్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఈ చిన్నది ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. అలాగే శివకార్తికేయన్ తోనూ ఓ సినిమా చేస్తుంది. ఎన్టీఆర్ డ్రాగన్ లో, నవీన్ పోలిశెట్టి మణిరత్నం సినిమాలోనూ ఛాన్స్ అందుకుందని టాక్.




