AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie: బీటౌన్‏లో మారుమోగుతున్న ‘లైగర్ ఆంథమ్ ర్యాప్ సాంగ్’.. చిత్రయూనిట్‏కు అంకితం చేసిన సింగర్..

ఎప్పటికప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ రిలీజ్ చేస్తున్న మేకర్స్ తాజాగా లైగర్ ఆంథమ్ ప్రైవేట్ ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. సింగర్ నిఖిలేష్ కుమార్ ఆలపించిన ఈ పాటను లైగర్ చిత్రయూనిట్ మొత్తానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Liger Movie: బీటౌన్‏లో మారుమోగుతున్న 'లైగర్ ఆంథమ్ ర్యాప్ సాంగ్'.. చిత్రయూనిట్‏కు అంకితం చేసిన సింగర్..
Liger Anthem
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2022 | 9:25 PM

Share

మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న లైగర్ (Liger) చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ (Vijay Deverakonda), బాలీవుడ్ బ్యూటీ అనన్య (Ananya Panday) జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‏గా విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉండగా.. మరోవైపు లైగర్ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ రిలీజ్ చేస్తున్న మేకర్స్ తాజాగా లైగర్ ఆంథమ్ ప్రైవేట్ ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. సింగర్ నిఖిలేష్ కుమార్ ఆలపించిన ఈ పాటను లైగర్ చిత్రయూనిట్ మొత్తానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ అభిమానులకు ప్రేమతో.. లైగర్ ఆంథమ్ ర్యాప్ సాంగ్ చిత్రయూనిట్ కు అంకితం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పాటను నిఖిలేష్ పాడడమే కాకుండా మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించాడు. ముంబై వీధులలో చాయ్ వాలాగా ఉన్న చిన్న కుర్రాడు బాక్సార్‏గా మారేందుకు తనను తాను ఎలా సిద్దం చేసుకున్నాడు..ఎలాంటి శిక్షణ తీసుకున్నాడు అనేది చూపిస్తూ తెరకెక్కించిన ఈ వీడియో సాంగ్‏కు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే నార్త్ లో రౌడీ హీరో ఫాలోయింగ్ ఏ రెంజ్‏లో పెరిగిందో తెలిసిందే. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పకనే చెప్పేశారు.

ఇదిలా ఉంటే..ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ, ఆఫత్ , లైగర్ ఆంథమ్ సాంగ్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీ నుంచి కోకా 2.0 అనే మూడవ పాటను ఆగస్ట్ 12న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!