Singer Chinmayi: ప్రధాని కావాలని కోరిన అభిమాని.. అదే వరస్ట్ ప్రపంచంలోనే టఫ్ అంటూ రిప్లై ఇచ్చిన సింగర్..

టాలీవుడ్ సింగర్ చిన్మయి (Singer Chinmayi) చెప్పాల్సిన పనిలేదు. మీటూ ఉద్యోమంతో ఇండస్ట్రీలో ఎదురైన సంఘటనల గురించి

Singer Chinmayi: ప్రధాని కావాలని కోరిన అభిమాని.. అదే వరస్ట్ ప్రపంచంలోనే టఫ్ అంటూ రిప్లై ఇచ్చిన సింగర్..
Singer

Updated on: Mar 15, 2022 | 8:40 AM

టాలీవుడ్ సింగర్ చిన్మయి (Singer Chinmayi) చెప్పాల్సిన పనిలేదు. మీటూ ఉద్యోమంతో ఇండస్ట్రీలో ఎదురైన సంఘటనల గురించి ధైర్యంగా గొంతువిప్పింది. అంతేకాకుండా.. ఇప్పటికీ లింగవివక్షత.. మహిళపై జరుగుతున్న దాడులపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. సింగర్‏గా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ అంశాలపై స్పందిస్తుంటుంది… చాలా కాలం తర్వాత తన ఫాలోవర్లతో ముచ్చటించింది చిన్మయి. అందులో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్పింది.. కొందరు కెరీర్ గురించి అడగ్గా.. మరికొందరు వ్యక్తిగత విషయాలను అడిగారు. వాటన్నింటికి చిన్మయి సమాధానాలు చెప్పింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. చిన్మయిని ప్రదానిగా చూడాలని ఉందంటూ కామెంట్ చేసింది. మీరు దేశానికి ప్రదాని అవ్వండి.. మీలాంటి వాళ్లే మాకు కావాలి అంటూ ఓ మహిళ మెసేజ్ చేసింది. దీనికి చిన్మయి నవ్వేసింది.. ప్రధాని అవ్వడం అంత సులువు అనుకుంటున్నారా ? పైగా ప్రపంచంలోకెల్లా అదే వరస్ట్. టఫెస్ట్ జాబ్ అంటూ చెప్పుకొచ్చింది చిన్మయి.

Chinmayi

అలాగే తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా అనేక ప్రశ్నలు అడిగారు.. మీపై చాలా ట్రోలింగ్.. నెగిటివిటీ వస్తుంటుంది. దానికి ఎలా స్పందిస్తారు ? అంటూ మరో నెటిజన్ అడగ్గా.. దీనికి చిన్మయి స్పందిస్తూ.. అలాంటి వాటిని తాను పట్టించుకోనని.. అందుకు తానేమి బాధాపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు