Simbu : సినిమా కోసం శింబు పడ్డ కష్టం అంతాఇంత కాదుగా.. న్యూ లుక్‌‌‌‌తో షాక్ ఇచ్చిన హీరో..

తమిళ్ స్టార్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. అయన నటించిన చాలా సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి...

Simbu : సినిమా కోసం శింబు పడ్డ కష్టం అంతాఇంత కాదుగా.. న్యూ లుక్‌‌‌‌తో షాక్ ఇచ్చిన హీరో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2021 | 7:01 AM

Simbu : తమిళ్ స్టార్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..ఆయన నటించిన చాలా సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. మన్మధ, వల్లభ సినిమాలతో తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాడు శింబు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాడు ఈ హీరో. తాజాగా ఈ స్టార్ హీరో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘వెందు తానింధతు కాదు’ అనే ఇంట్రస్టింట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు శింబు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం శింబు కొత్తలుక్‌‌‌లోకి మారాడు. ఫస్ట్ లుక్ చూసిన వారందరు.. అసలు శింబును గుర్తుపట్టలేకపోయారు. అంతలా మారిపోయాడు.

ఈ సినిమా కోసం ఏకంగా ఏకంగా 30 కేజీల బరువు తగ్గి కొత్తగా కనిపిస్తున్నాడు. తన నయా గెటప్ ను శింబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన పాత ఫొటోకు రీసెంట్ ఫోటోను జోడించి సోషల్ మీడియాలో షేర్  చేశాడు శింబు. అభిమానులంతా ఈ ఫోటో చూసి షాక్ అవుతున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన మిగిలిన సినిమాలకంటే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండనుంది.  అందుకే ఈ సినిమా కోసం శింబు చాలా కష్టపడి తన లుక్ ను మార్చుకున్నాడు శింబు.

Imbhu

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..