Life Of Muthu: కోలీవుడ్ స్టార్ హీరో శిలంబరసన్ అలియాస్ శింబు (Simbu) నటించిన తాజా చిత్రం వెందు తానింధదు కాడు. గౌతమ్ వాసుదేవ మేనన్ (Gautham Vasudev Menon) దర్శకుడు. సిద్ధి ఇద్నాని, రాధికా శరత్ కుమార్, సిద్ధిక్,అప్పుకుట్టి తదితరులు నటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శింబు గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో విడుదలైన యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మానాడు సినిమా తర్వాత ఈ సినిమా రూపంలో శింబుకు మరో భారీ హిట్ దక్కింది. ఈ సినిమా విజయంతో చిత్రబృందమంతా సంతోషంలో మునిగితేలుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఇశారీ గణేశ్ చిత్రబృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అంతేకాదు హీరో శింబుకు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శింబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు.
కాగా పల్లెటూరు నుంచి బతుకు తెరువు కోసం సిటీకి వచ్చిన ఓ యువకుడు పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ది లైఫ్ ఆఫ్ ముత్తు రూపొందించారు. ఈ సినిమాలో శింబు లుక్‌తో పాటు నటన చాలా బాగుందంటూ విమర్శకులు ప్రశంసలు అందాయి. ఇక ఈ చిత్రం కోసం శింబు 15 కేజీల వరకు బరువు తగ్గాడు. అలాగే చాలా రోజుల తర్వాత గౌతమ్ మేనన్ డైరెక్షన్‌తో ఆకట్టుకున్నారని ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాకు కథను జయమోహన్ అందించాడు. రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఆంథొనీ ఎడిటర్‌గా వ్యవహరించారు. క ఈ సినిమా తర్వాత కృష్ణ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడు శింబు. పాతు తాల పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరోసారి అండర్ వరల్డ్ డాన్ పాత్రను పోషించనున్నాడు శింబు. శాండల్‌వుడ్ హిట్ మూవీ ‘మఫ్టీ’ కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా కనిపించనుంది.
Producer Dr @IshariKGanesh gifted a Brand New Luxury Car to #Atman @SilambarasanTR_ & Royal Enfield bike to Director @menongautham for the Huge success of #VendhuThanindhathuKaadu at #VTKSuccessParty@arrahman @VelsFilmIntl @RedGiantMovies_ @Udhaystalin pic.twitter.com/037UU5j4nH
— Vels Film International (@VelsFilmIntl) September 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..