AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు త‌న‌కే కాల్ చేసింద‌ట‌…ఓపెన్ అయిన స్టార్ హీరో..

అప్పట్లో సిల్క్ పాట ఉంది అంటే చాలు థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యేవి. ఇప్పటికి ఆమె మరణం అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఆమె చనిపోయే ముందు రోజు ఓ నటుడి కాల్ చేసిందట.

Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు త‌న‌కే కాల్ చేసింద‌ట‌…ఓపెన్ అయిన స్టార్ హీరో..
Silk Smitha
Ram Naramaneni
|

Updated on: Oct 11, 2024 | 8:10 AM

Share

విజయలక్ష్మి వడ్లపాటి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. అదే సిల్క్ స్మిత అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వారు ఉండరు. వెండి తెరను ఊపేసిన నటి ఆవిడ. ఆమె డేట్స్ దొరికితే చాలు అని  90స్ లో స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. మత్తెక్కించే కళ్లు, నాజూకు వయ్యారంతో.. తను ప్రేక్షకులను అందాల దేవతగా అలరించింది. ఎంత త్వ‌ర‌గా స్టార్‌గా ఎదిగిందో..అంతే త్వ‌ర‌గా పడిపోయింది సిల్స్ స్మిత‌. ఆమె జీవిత క‌థాశంతో డ‌ర్టీ పిక్చ‌ర్ అనే మూవీ తెరకెక్కింది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో తన మార్క్ చూపిన సిల్క్ స్మిత మ‌ర‌ణం ఇప్ప‌టికే అంతుచిక్క‌ని మిస్ట‌రీనే.  ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయని ఇప్పుటికీ ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. అయితే  సిల్క్ స్మిత ఫ్రెండ్.. కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్ ఆమె మ‌ర‌ణానికి ముందు రోజు జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు బాహ్య ప్రపంచంతో పంచుకున్నారు.

1992లో సిల్క్ స్మిత, రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే మూవీలో న‌టించారు. అప్పట్నుంచే వీళ్లు మంచి మిత్రులు అయ్యారు. ఆమె చనిపోయే ముందు వ‌ర‌కు కూడా వీరి ఫ్రెండ్షిప్ కొనసాగింది. స్మిత తనతో ఎంతో గౌవరం ఇచ్చేవారని… అలాగే తానూ ఆమె పట్ల గౌరవంతో ఉండేవాడినని వెల్లడించాడు రవి. సిల్క్ స్మిత చనిపోయే ఒక్కరోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పుకొచ్చాడు ఈ న‌టుడు. ఆమె ఒత్తిడిలో తనను కలవాలని ట్రై చేసిందేమో కానీ.. అది వీలుప‌డ‌లేద‌ని గుర్తు చేసుకున్నాడు. ఓ చిత్ర చిత్రీకరణలో ఉన్నందుకు కాల్ లిఫ్ట్ చేయలేకపోయానని.. లేక‌పోతే దారుణం జ‌రిగి ఉండ‌క‌పోయేద‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేదో రెగ్యుల‌ర్ కాల్ అనుకున్నానని.. అందుకే మళ్లీ రిటన్ చెయ్య‌లేద‌ని చెప్పాడు రవిచంద్రన్. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తనకు ఫోన్ చేసిందని.. ఆ తర్వాత రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు రవిచంద్రన్. సిల్క్ స్మిత‌ చనిపోవడం తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అని.. ఆ కాల్ లిఫ్ట్ చేయలేదనే రిగ్రెట్ తనను ఎల్లప్పుడూ వెంటాడుతుందని ఓ సందర్భంలో రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.

Veeraswamy Ravichandran

Veeraswamy Ravichandran

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?