AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddu Jonnalagadda: టిల్లు అన్నతో కలిసి నటించాలని ఉందా? ‘బ్యాడాస్’ మూవీ టీం కాస్టింగ్ కాల్.. పూర్తి వివరాలు

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. జాక్ రిజల్ట్ తో కొంచెం వెనకపడినా ఇప్పుడీ క్రేజీ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అందులో బ్యాడాస్ మూవీ కూడా ఒకటి.

Siddu Jonnalagadda: టిల్లు అన్నతో కలిసి నటించాలని ఉందా? 'బ్యాడాస్' మూవీ టీం కాస్టింగ్ కాల్.. పూర్తి వివరాలు
Badass Movie Casting Call
Basha Shek
|

Updated on: Sep 18, 2025 | 7:30 PM

Share

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో ఫుల్ జోష్ లో ఉన్న సిద్దు జొన్నలగడ్డకు జాక్ చిన్నపాటి షాక్ ఇచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం జాక్ దుమ్మురేపింది. దీని తర్వాత తెలుసుకుదా అనే సినిమాలో నటిస్తున్నాడు సిద్దు. అలాగే తనకు బాగా అచ్చొచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు. అదే బ్యాడాస్. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బ‌బుల్‌గ‌మ్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌వికాంత్ పేరెపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సిద్దూ పోస్టర్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా బ్యాడాస్ సినిమా మేకర్స్ కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. నటనపై బాగా ఆసక్తి ఉండి తెలుగు అనర్గళంగా మాట్లాడే వారు ఈ ఆడిషన్స్ కు హాజరవ్వొచ్చని సూచించారు.

తండ్రి పాత్ర కోసం 40 నుంచి 60 ఏళ్ల మధ్య వ‌య‌సున్న వారు, 20 నుంచి 60 ఏండ్ల వ‌య‌సున్న మేల్ ఆర్టిస్టులు, 20 నుంచి 60 ఏళ్ళ వయసున్న ఫిమేల్ ఆర్టిస్టులు,13 నుంచి 15 ఏళ్ల వయసున్న యువ‌కులు ఈ ఆడియన్స్ హాజరై తమ అదృష్టం పరీక్షించుకోవాలని మేకర్స్ కోరారు. ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్, నటనకు సంబంధించిన వీడియోలను badassfilmcasting@gmail.com మెయిల్ ఐడీకి లేదా +91 9502619987 వాట్సాప్ నంబర్‌ కు పంపించాలని సూచించారు. ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ను అనుమతించమని, అలాగే ఫోన్ కాల్స్ ను కూడా స్వీకరించమని ఈ సందర్భంగా మేకర్స్ పోస్ట్ లో క్లియర్ గా సూచించారు.

ఇవి కూడా చదవండి

బ్యాడాస్ టీమ్ క్యాస్టింగ్ కాల్..

లిటిల్ హార్ట్స్ టీమ్ తో సిద్దు జొన్నలగడ్డ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!