Tillu Square Collections: టిల్లుగాడి దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. 5 రోజుల్లో ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ ఎంతంటే..

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.. అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రానికి అడియన్స్ బ్రహ్మారథం పట్టారు. డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్.. సిద్ధూ డైలాగ్ డెలివరీ.. అనుపమ నటన ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. మొదటి రోజు నుంచి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ.. అటు ఐదు రోజుల్లోనూ ఏమాత్రం జోరు తగ్గడం లేదు. బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది ఈ సినిమా.

Tillu Square Collections: టిల్లుగాడి దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. 5 రోజుల్లో 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్ ఎంతంటే..
Tillu Square
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2024 | 3:11 PM

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‏ఫుల్ గా దూసుకుపోతున్న సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజ్ అయిన ఈమూవీకి షాకింగ్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ముందే మూవీ లవర్స్‏కు క్యూరియాసిటీని కలిగించిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు తారుమారు చేస్తుంది. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.. అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రానికి అడియన్స్ బ్రహ్మారథం పట్టారు. డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్.. సిద్ధూ డైలాగ్ డెలివరీ.. అనుపమ నటన ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. మొదటి రోజు నుంచి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ.. అటు ఐదు రోజుల్లోనూ ఏమాత్రం జోరు తగ్గడం లేదు. బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది ఈ సినిమా.

గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు జనాలకు తెగ నచ్చేసింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే రూ. 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇక నిన్నటి వరకు 5 రోజుల్లో ఏకంగా రూ. 85 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ మూవీ రూ. 100 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న టిల్లు స్క్వేర్.. అటు అమెరికాలోనూ సత్తా చాటుతుంది. ఇప్పటివరకు దాదాపు రూ. 2 మిలియన్ డాలర్స్ పైగా వసూలు చేసింది. టిల్లు స్క్వేర్ రూ. 28 కోట్లు షేర్ కలెక్షన్స్ వస్తే ఈవెన్ అయినట్లే. ఇప్పటికీ టిల్లు స్క్వేర్ సినిమాకు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో సిద్దూ మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ టిల్లు క్యూబ్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!