Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuvvostanante Nenoddantana: అందమైన ప్రేమకథ మళ్లీ వచ్చేస్తోంది.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీరిలీజ్ ఎప్పుడంటే..

ఇప్పటికే చెన్నకేశవ రెడ్డి, నువ్వే నువ్వే, జల్సా, ఖుషి, పోకిరి, వర్షం, బిల్లా, బాద్ షా చిత్రాలను విడుదల చేసి సక్సెస్ అయ్యారు. అలాగే కొన్ని ప్రేమకథలను కూడా మరోసారి రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రేమికుల వారం నడుస్తోంది.

Nuvvostanante Nenoddantana: అందమైన ప్రేమకథ మళ్లీ వచ్చేస్తోంది.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీరిలీజ్ ఎప్పుడంటే..
Nuvvostanante Nenoddantana
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 09, 2023 | 3:36 PM

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు స్టార్ హీరోస్ బర్త్ డేస్.. లేదా ఏవైన ప్రత్యేక రోజులలో మాత్రమే రీరిలీజ్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా దర్శకుల పుట్టినరోజు వేడుకలకు కూడా పలు చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు అలా కాకుండా సమయం దొరికితే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చెన్నకేశవ రెడ్డి, నువ్వే నువ్వే, జల్సా, ఖుషి, పోకిరి, వర్షం, బిల్లా, బాద్ షా చిత్రాలను విడుదల చేసి సక్సెస్ అయ్యారు. అలాగే కొన్ని ప్రేమకథలను కూడా మరోసారి రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రేమికుల వారం నడుస్తోంది. ఈ సందర్భంగా మరో అందమైన ప్రేమకథను రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

తెలుగు చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయిన అందమైన ప్రేమకథలలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. ప్రభుదేవా దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ సినిమాను ఎంఎస్ రాజు నిర్మించారు. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా..భారీగా వసూళ్లు రాబట్టింది. ప్రేమించిన అమ్మాయి కోసం ధనవంతుల కొడుకైన హీరో వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యను మెప్పించడం ఈ చిత్ర కథాంశం.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న 4కె వెర్షన్ తో రీరిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఇందులో లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్, శ్రీహరి, ప్రకాష్ రాజ్ ల క్యారెక్టర్స్, సునీల్, సంతోషి, నర్సింగ్ యాదవ్ కామెడీ అలరిస్తుంది. అలాగే ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ రీరిలీజ్ ప్రమోషన్స్ కోసం హీరోహీరోయిన్, డైరెక్టర్ ను కూడా రంగంలోకి దింపబోతున్నారని టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.