Shyam Singha Roy: ఆస్కార్‌కు నామినేట్ అయిన నేచురల్ స్టార్ సినిమా.. ఏ ఏ క్యాటగిరిలోనంటే..

|

Aug 17, 2022 | 8:50 PM

టాలీవుడ్ సినిమాల రేంజ్ రోజు రోజుకు పెరిగిరిపోతోంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం మన సినిమాల వైపే చూస్తుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరు తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Shyam Singha Roy: ఆస్కార్‌కు నామినేట్ అయిన నేచురల్ స్టార్ సినిమా.. ఏ ఏ క్యాటగిరిలోనంటే..
Shyam Singha Roy
Follow us on

టాలీవుడ్ సినిమాల రేంజ్ రోజు రోజుకు పెరిగిరిపోతోంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం మన సినిమాల వైపే చూస్తుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరు తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా గౌరవాన్ని నేచురల్ స్టార్ నాని సినిమా కూడా పెంచేసింది. నాని నటించిన సినిమా ఏకంగా ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక అయ్యింది. చాలా రోజుల తర్వాత నాని హిట్ కొట్టిన సినిమా శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy). రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మడోనా సెబాస్టియన్, కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటించారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక సాయి పల్లవి నటన ఈ సినిమాకు మరో హైలైట్.

2021 డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. అలాగే మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అలాగే ఓటీటీలోనూ సత్తా చాటింది శ్యామ్ సింగరాయ్. ఇక ఈ సినిమా ఇప్పుడు మరో ఘనతను అందుకుంది. ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో ఈ సినిమా ఎంపిక అయ్యింది. మూడు విభాగాల్లో నామినేట్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. పీరియాడిక్ డ్రామా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ విభాగాల్లో శ్యామ్ సింగరాయ్ సినిమా నామినేట్ అయ్యింది. మరి పోటీని తట్టుకొని సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంటుందో లేదో తెలియదు. ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో నాని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఇవి కూడా చదవండి