Shruti Haasan: ఆ హీరో సినిమా వల్లే నా కెరీర్ మారింది.. శ్రుతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ ఏడాది సంక్రాంతి పండగకు మెగాస్టార్ చిరాంజీవి వాల్తేరువీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో హిట్స్ అందుకుంది ఈ భామ. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Shruti Haasan: ఆ హీరో సినిమా వల్లే నా కెరీర్ మారింది.. శ్రుతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shruti Haasan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 09, 2023 | 11:10 AM

అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. క్రాక్ సినిమా తర్వాత ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా రెండు సూపర్ హిట్ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఈ ఏడాది సంక్రాంతి పండగకు మెగాస్టార్ చిరాంజీవి వాల్తేరువీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో హిట్స్ అందుకుంది ఈ భామ. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తోరూపొందుతోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. అలాగే తమిళ్ లోనూ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది.

తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను హీరోల వయస్సును పట్టించుకోనని నేను నటినని చెప్పుకొచ్చింది శృతి హాసన్. అలాగే ఈ ముద్దుగుమ్మ మరిన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. సీనియర్ హీరోలకు జోడీగా నటించడం గురించి కొంతమంది విమర్శలు చేశారు కానీ నేను అవి పట్టించుకోను అంది శ్రుతి.

అలాగే పెళ్లిగురించి మాట్లాడుతూ.. జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం అని చెప్పుకొచ్చింది. హిందీలో నా సినీ కెరీర్ మొదలైందని పవన్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో నా జాతకం మారిందని ఆమె కామెంట్లు చేశారు. మా నాన్న బ్యానర్ లో తెరకెక్కే సినిమాలలో నటించే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వదులుకోనని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.