Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar Dada M.B.B.S.: మెగాస్టార్ సూపర్ హిట్ శంకర్ దాదా మూవీలోని ఈ బుడతడు ఎవరో తెలుసా..?

బాలీవుడ్ లో వచ్చిన మున్నాభాయ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. తెలుగులో ఈ సినిమాలో చిరంజీవి నటించగా మరో కీలక పాత్రలో హీరో శ్రీకాంత్ నటించాడు. ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు.

Shankar Dada M.B.B.S.: మెగాస్టార్ సూపర్ హిట్ శంకర్ దాదా మూవీలోని ఈ బుడతడు ఎవరో తెలుసా..?
Shankar Dada Mbbs
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 09, 2023 | 11:32 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఒకటి. బాలీవుడ్ లో వచ్చిన మున్నాభాయ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. తెలుగులో ఈ సినిమాలో చిరంజీవి నటించగా మరో కీలక పాత్రలో హీరో శ్రీకాంత్ నటించాడు. ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు. ఇక సోనాలి బింద్రా హీరోయిన్ గ నటించిన ఈ సీమ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో కనిపిస్తున్న సీన్ గుర్తుందా..? చిరంజీవి ఆ పిల్లాడి మానసిక పరిస్థితిని బాగుచేసే సీన్ ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తుంది. ఇంతకూ ఆ సీన్ లో నటించిన చిన్న పిల్లడు ఎవరో తెలుసా.?

శంకర్ దాదా సినిమాలో నటించిన ఆ పిల్లడు మరెవరో కాదు.. మెగా ఫ్యామిలీ కి సంబందించి హీరోనే.. అతడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ అతడు. వైష్ణవ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.

తొలి సినిమాతోనే 100 కోట్ల మార్క్ ను అందుకున్నాడు వైష్ణవ్. ఆ తర్వాత వరుస సినిమా లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రానున్నాడు వైష్ణవ్. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే ఇలా మెగాస్టార్ సినిమాలో కనిపించి ఆకట్టుకున్నాడు వైష్ణవ్. Vaishnav Tej

Vaishnav Tej