Shruti Haasan: ఐరెన్ లెగ్ నేను కాదు అతనే.. షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్

అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Shruti Haasan: ఐరెన్ లెగ్ నేను కాదు అతనే.. షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్
Shruti Haasan

Updated on: Jul 31, 2025 | 3:40 PM

అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురైన శ్రుతిహాసన్ కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ రాణిస్తుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేసిందో ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మధ్యలో లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నా రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.

శ్రుతిహాసన్ రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్ మూవీతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్- రజనీ కాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక సలార్ పార్ట్ 2లోనూ ఆమె నటించాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు శ్రుతి చేతిలో ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. శ్రుతి కెరీర్ బిగినింగ్ లో వరుస ఫ్లాప్స్ అందుకుంది.. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. అయితే ఫ్లాప్స్ అందుకున్న సమయంలో శ్రుతిని ఐరన్ లెగ్ అని కొంతమంది ట్రోల్ చేశారు. దీని పై శ్రుతి మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లో సిద్దార్థ్‌ తో వరుసగా సినిమాలు చేశా.. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో మీరు అర్ధం చేసుకోవచ్చు ఐరెన్ లెగ్ ఎవరో అని చెప్పుకొచ్చింది. సినిమా కోసం అందరం కలిసి పని చేస్తాం.. ఎంతో కష్టపడి పని చేస్తాం.. కానీ అది మన చేతిలో ఉండదు అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.