లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మెప్పించింది శ్రుతి. అందం అభినయం కలబోసిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పించిన ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అడపాదడపా హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది శ్రుతిహాసన్. ఇక ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత క్రాక్ సినిమాతో హిట్ అందుకుంది.
రవితేజ నటించిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. చిత్రవిచిత్రమైన పోస్ట్లు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది శ్రుతిహాసన్.
తాజాగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఇన్నేళ్లు ఉండటానికి కారణం తెలిపింది. నచ్చినట్లు పని చేసుకుంటూ వెళ్లడమే ఇండస్ట్రీలో ఇంతకాలం తాను ఇండస్ట్రీలో ఉండటానికి కారణం అని తెలిపింది. హీరోయిన్ గా పరిచయమైన కొత్తలో స్టార్ హీరో కూతురిగా సెట్స్ లో నేను ప్రవర్తిస్తానో అని అనుకునేవారు. కానీ నేనెప్పుడూ ఒకరి ఊహలకు అంచనాలకు అందలేదని చెప్పుకొచ్చింది శ్రుతి. అలాగే తనకున్న చిన్నవారితో, పెద్ద హీరోలతో నటించానని తనకు వయసుతో ఎలాంటి సమస్య లేదు అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ చిన్నది, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ సినిమాల్లో నటిస్తుంది.