Shriya Saran: ఆకట్టుకుంటోన్న ‘గమనం’ పాట.. సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేస్తోన్న ‘మ్యాస్ట్రో’ మ్యూజిక్‌..

ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందింది శ్రియా శరన్‌. పెళ్లైన తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై పెద్దగా కనిపించని ఆమె మళ్లీ వరుసగా సినిమాల్లో బిజీగా మారుతోంది..

Shriya Saran: ఆకట్టుకుంటోన్న గమనం పాట.. సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేస్తోన్న మ్యాస్ట్రో మ్యూజిక్‌..

Updated on: Nov 28, 2021 | 9:44 PM

ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందింది శ్రియా శరన్‌. పెళ్లైన తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై పెద్దగా కనిపించని ఆమె మళ్లీ వరుసగా సినిమాల్లో బిజీగా మారుతోంది. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్స్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న మరో చిత్రం ‘గమనం’. ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రియతో పాటు ప్రియాంక జువాల్కర్‌, సుహాస్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌(అతిథి పాత్ర)లో ఈ సినిమాలో నటించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

కాగా సుజనారావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సంగీత దిగ్గజం ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘గమనం’ నుంచి ‘సాంగ్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో ఓ సరికొత్త పాటను అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. కైలాశ్‌ ఖేర్‌ ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. ముఖ్యంగా ‘అందని ఆకాశాలే…కోరెనే నేల..తీరని ఆశేనంటూ ఒప్పుకోవేల’ సాగే ఈ పాట లిరిక్స్‌ చాలా బాగున్నాయని సంగీత ప్రియులు చెబుతున్నారు. కాగా భావోద్వేగాలతో కూడుకున్న కథతో తెరకెక్కిన ‘గమనం’లో శ్రియ దివ్యాంగురాలి పాత్ర పోషించింది.Also Read:

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి

Shiva Shankar Master : సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

K.G.F: Chapter 2: ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న “కేజీఎఫ్” టీమ్.. మరోసారి సినిమా వాయిదా తప్పదా..?