
కన్నడ భాష గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టింది’ అని కమల్ హాసన్ వ్యాఖ్యానించడంపై కన్నడ అనుకూల సంస్థలు మండిపడుతున్నాయి. కమల్ హాసన్ పై కన్నడ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఈ వివాదంపై కమల్ స్పందించారు. బుధవారం (మే29) కేరళలో దీనిపై స్పష్టత ఇచ్చిన కమల్ హాసన్, “ప్రేమతో మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్పలేను” అని అన్నారు. కానీ ఇప్పుడు, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ వెంకటేష్‌ను చర్చల కోసం ఛాంబర్‌కు పిలిపించాం. కమల్ హాసన్‌ను సంప్రదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఆయన సినిమా ‘థగ్ లైఫ్’ విడుదలకు అనుమతి ఉండదు’ అని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహలు పేర్కొన్నారు.
థగ్ లైఫ్ చిత్ర కర్ణాటక పంపిణీదారు వెంకటేష్ ఈ సందర్భంగా మట్లాడుతూ.. ‘ఒక కన్నడిగుడిగా, కమల్ హాసన్ ప్రకటనను నేను ఖండిస్తున్నాను’ అన్నారు. ‘చాంబర్‌లో జరిగినదంతా కమల్ హాసన్‌కి చెబుతాం. మాకు కన్నడ భాష, వ్యాపారం రెండూ ముఖ్యమైనవే. మేము థగ్ లైఫ్ నిర్మాణ బృందానికి చెప్పాం. వారితో క్రమం తప్పకుండా మాట్లాడుతున్నాం’ అని థగ్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చారు.
కాగా ఈ వ్యవహారంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కమల్ హాసన్‌కి మద్దతుగా నిలిచారు. కమల్‌ని విమర్శిస్తున్నవారు కన్నడ భాష కోసం ఏం చేశారని ప్రశ్నించారు. వివాదం వచ్చినప్పుడు మాత్రమే స్పందించకుండా, ఎప్పుడూ కన్నడ భాషను, కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సాహించాలని సూచించారు.
‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కానుంది. ఇది పాన్-ఇండియా చిత్రం. కమల్ హాసన్, అభిరామి, సింబు, త్రిషతో పాటు పలువురు స్టార్లు ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.