కామెడీ బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు నటిస్తోన్న యాంథాలజీ పంచతంత్రం . టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వరదన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ప్రశాంత్ ఆర్.విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ .. ‘అఖిలేష్ కోసమే ఈ సినిమా చేశాను. హర్ష ఇంత మంచి కథను రాస్తాడని, ఇంత చక్కగా నెరేట్ చేస్తాడని నేను అనుకోలేదు. లేఖ అనే అందమైన క్యారెక్టర్‌ను నాకు ఇచ్చినందుకు హర్షకి థాంక్స్. హర్ష గొప్ప స్థాయికి వెళతాడు. ఈ సినిమా చేసినవారందరూ నా స్నేహితులే. సినిమాటోగ్రాఫర్ రాజ్‌కి థాంక్స్. నన్ను చాలా చక్కగా చూపించారు. ప్రశాంత్, శరవణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కిట్టు మంచి డెప్త్‌తో పాటలు రాశారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి లాంటి అద్భుతమైన నటులతో కలిసి నా కెరీర్ స్టార్టింగ్‌లోనే నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. పర్సనల్‌గా నాకు దివ్య, విద్య అనే మంచి ఫ్రెండ్స్‌ను ఈ సినిమాకు ఇచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 9న థియేటర్స్‌లో చూడండి. తప్పుకుండా సినిమా మీకు నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా అందరికీ మంచి సక్సెస్ నివ్వాలి అంటూ కన్నీరు పెట్టుకుంది శివాత్మిక
ఇక డైరెక్టర్ హర్ష పులిపాక మాట్లాడుతూ ‘ఈవెంట్‌కి హరీష్ శంకర్‌గారు రావటం అనేది మాకు చాలా బలాన్నిచ్చింది. ఈ సినిమా రెండేళ్ల కష్టం. నిజాయతీగా చేసిన ప్రయత్నం. సింపుల్ కథలను అందంగా మీ ముందు చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా పరంగా నేను ముందుగా అభినయ కృష్ణ అనే నా స్నేహితుడికి థాంక్స్ చెప్పుకోవాలి. తన వల్లే టికెట్ ఫ్యాక్టరీకి వచ్చి అఖిలేష్‌ను కలిశాను. అఖిలేష్ వండర్‌ఫుల్ పర్సన్. నా తర్వాత ఈ సినిమా సమానంగా పేపర్ మీద ఎక్స్‌పీరియెన్స్ చేసిన తను. ప్యాషన్‌తో పాటు తన దగ్గరున్నందంతా ఇందులో పెట్టేశాడు తను. ఇండస్ట్రీకి ఇద్దరం కొత్త వాళ్లం. స్క్రిప్ట్ మీదున్న కాన్ఫిడెన్స్‌తో ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఈ జర్నీలో చాలా సమస్యలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ కలిసే ఫేస్ చేశాం. ఈ సినిమాలో విద్య, దివ్య, స్వాతి, శివాత్మిక, దివ్యవాణి మెయిన్ లీడ్స్ కనిపిస్తారు. వీరందరూ తెలుగువాళ్లే. ఆరుగురు మేల్ లీడ్స్ రాహుల్, నరేష్, సముద్ర ఖని, ఉత్తేజ్, వికాస్, ఆదర్శ్.. అద్భుతమైన కంట్రిబ్యూట్ చేశారు. నేను రాసుకున్న ప్రతి క్యారెక్టర్‌కు న్యాయం చేయడానికి ప్రతి ఒక ఆర్టిస్ట్ సపోర్ట్ చేశారు. డిసెంబర్ 9న థియేటర్స్‌లో మీ ముందుకు రాబోతున్నాం’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..