దేశంలోనే మొదటి పంచపీఠమైన జగద్దురు రంభపురి మఠం కూడా ఒకటి. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని ఎన్‌ఆర్‌పూర్ తాలూకాలో ఉన్న ఈ క్షేత్రానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ఈ మఠాన్ని తరచూ సందర్శిస్తుంటారు. బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు తరచూ ఇక్కడికి వస్తుంటారు. తాజాగా మరోసారి రంభపురి మఠాన్ని సందర్శించారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు. దీనిని రంభపురి మఠం నిర్వాహకులు డాక్టర్ వీర సోమేశ్వర స్వామిజీ ఆదివారం (డిసెంబర్ 15) ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా ఇది పేరుకు మాత్రమే రోబోటిక్ ఏనుగు. చూడడానికి ఇది నిజమైన ఏనుగులా కనిపిస్తుంది. చెవులు, తల, తొండం, తోక కదులుతూనే ఉంటూ భక్తులకు సేవలు అందిస్తుంటాయి.
కాగా ఈ మధ్యన ఆలయాలకు నిజమైన ఏనుగు బదులు రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏనుగులు జనంపై దాడి చేయడం , వాటి ఉక్కు పాదాలతో భక్తులను తొక్కివేయడం తరచూగా జరుగుతన్నాయి. ఇక చాలా చోట్లు మావటీలు కూడా ఏనుగుల పట్ల క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మంది ఆలయాలకు నిజమైన ఏనుగులను బదులు రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇస్తున్నారు. గుడి కార్యక్రమాలకు, ఊరేగింపులకు దీన్ని ఉపయోగించడం వల్ల ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇప్పుడు శిల్పాశెట్టి దంపతులు కూడా ఇదే అనుసరించారు. కాగా కర్ణాటకలోని చాలా ఆలయాల్లో నిజమైన ఏనుగులను దానం చేయకూడదని నియమాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు రోబోటిక్ ఏనుగు దాతల సంఖ్య కూడా పెరిగింది. కర్ణాటకలోని యెడియూర్‌లోని సిద్ధలింగేశ్వరాలయంలో కూడా రోబోటిక్ ఏనుగు ఉంది.
కాగా అశ్లీల చిత్రాల నిర్మాణం, మనీలాండరింగ్‌కు సంబంధించి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, పారిశ్రామికవేత్త రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. సంబంధిత కేసుల్లో ఈ వారం రాజ్ కుంద్రాను ప్రశ్నించనున్నారు. 49 ఏళ్ల కుంద్రాతో పాటు మరికొంత మంది ఇళ్లు, కార్యాలయాలు సహా ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించిన తర్వాత సమన్లు జారీ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.