ఆలస్యంగా తెలిసొచ్చింది.. నాజీవితంలో అది ఎప్పుడూ చేయలేదు: శర్వానంద్
కొందరు హీరోలు తమ సినిమాల కోసం చాలా కష్టపడతారు.ప్రేక్షకులను మెప్పించేందుకు కొత్తగా కనిపించేందుకు తమ శరీరాన్ని ఎంతైనా బాధ పెట్టుకుంటారు. అసరమైతే బరువు పెరుగుతారు. సన్నగా కూడా మారిపోతారు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో తన లుక్ మొత్తం మార్చేశాడు.

గతంలో పోల్చితే పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేశాడు శర్వానంద్. గతేడాది అతను నటించిన మనమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ యావరేజ్ గానే నిలిచింది. ప్రస్తుతం బైకర్ అనే సినిమా చేస్తున్నాడు అలాగే నారి నారి నడుమ మురారి అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు ఛార్మింగ్ స్టార్. దీంతో పాటు శర్వా చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. కాగా 2023 జూన్ లో రక్షితా రెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు శర్వానంద్. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా గతేడాది పండంటి ఆడ బిడ్డ వారి జీవితంలోకి అడుగు పెట్టింది. తమ గారాల పట్టీకి లీలా దేవీ మైనేని అని పేరు పెట్టారు శర్వా దంపతులు.
చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు
ఇదిలా ఉంటే ఇటీవలే శర్వానంద్ బక్కచిక్కిన బాడీతో కనిపించి షాక్ ఇచ్చాడు. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అదరగొట్టారు. శర్వానంద్ ఎంతో ఇంతలా మారిపోయాడు అని చాలా మంది ఆరా తీశారు. తాజాగా దీని పై ఓ క్లారిటీ ఇచ్చారు శర్వానంద్. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని నా కూతురు పుట్టాకే తెలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు శర్వా.. నా శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాను.. నా కుటుంబం కోసం స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నా..
దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే
నాకు 2019లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో నా చేతికి సర్జరీ అయింది. మెడిసిన్ లో భాగంగా యాంటిబయాటిక్స్ వాడటం వల్ల ఎప్పుడూ బాగా ఆకలేసేది. దాంతో నేను విపరీతంగా బరువు పెరిగిపోయాను. ఏకంగా 92 కిలోలకు చేరాను. అప్పుడు నాకు తెలియదు.. నేను ఎంత మారిపోయాననేది చాలా ఆలస్యంగా అర్థమైంది. యాక్టివ్‌గా ఉండేందుకు రెండేళ్ల క్రితం వాకింగ్ ప్రారంభించాను, ఇప్పుడిలా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు శర్వానంద్..నా జీవితంలో వర్కవుట్స్ చేసింది లేదు. నా కూతురు పుట్టిన తర్వాతే నేను స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నా అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం శర్వా దంపతులు విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు శర్వా చేసిన కామెంట్స్ తో ఆ రూమర్స్ కు చెక్ పడింది.




