AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dunki Trailer: షారుఖ్ ఈజ్ బ్యాక్.. మరోసారి కామెడీతో అదరగొట్టేసిన బాద్ షా.. ‘డంకీ’ ట్రైలర్ చూశారా ?..

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్, నయన్, దీపికా కలిసి నటించిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్సాన్స్ వచ్చింది.  బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  దీంతో ఇప్పుడు డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు షారుఖ్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుననారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

Dunki Trailer: షారుఖ్ ఈజ్ బ్యాక్.. మరోసారి కామెడీతో అదరగొట్టేసిన బాద్ షా.. 'డంకీ' ట్రైలర్ చూశారా ?..
Dunki Trailer
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2023 | 11:27 AM

Share

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఫుల్ జోష్ మీదున్నారు. చాలా కాలంగా వరుస డిజాస్టర్లతో కొట్టుమిట్టాడుతున్ని బీటౌన్ ఇండస్ట్రీకి ఊపిరినిచ్చాడు. పఠాన్ సినిమాతో రికార్డ్స్ తిరగరాశాడు బాద్ షా. ఇక ఇటీవలే జవాన్ మూవీ సైతం భారీగా కలెక్షన్స్ రాబట్టింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్, నయన్, దీపికా కలిసి నటించిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్సాన్స్ వచ్చింది.  బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  దీంతో ఇప్పుడు డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు షారుఖ్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుననారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఒక ఊళ్లో ఉండే అయిదుగురు స్నేహితులు ఎలాగైనా లండన్ వెళ్లాలి అనుకుంటారు. అధికారికంగా వెళ్లాలంటే ఇంగ్లీష్ రావాలని తెలుస్తుంది. అలాగే వారికి వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. అయితే గతంలో బ్రిటిష్ వారు వచ్చినట్లే అక్రమంగా వెళ్తారు. అయితే వారు లండన్ ఎలా వెళ్లారు ?ఆ సమయంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? అనేది డంకీ చిత్రం. చాలా కాలం తర్వాత మరోసారి తన కామెడీ టైమింగ్ తో అలరించేందుకు సిద్ధమయ్యారు షారుఖ్.

ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. అయితే అదే సమయంలో సలార్ సైతం విడుదల కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద షారుఖ్, ప్రభాస్ మధ్య పోటీ ఉండనుంది. ఈ ఏడాది వరుసగా మూడు చిత్రాలతో షారుఖ్, హ్యాట్రిక్ హిట్ సాధించాలని చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us