నటుడిగా మారిన ప్రముఖ సింగర్.. ‘మ్యూజిక్ స్కూల్’ అనే సినిమాలో ప్రాధాన పాత్రలో షాన్..

| Edited By: Anil kumar poka

Oct 13, 2021 | 7:54 AM

వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ  ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సింగర్ షాన్. ఆయన ఇప్పుడు పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాష‌ల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్‌’ కోసం న‌టుడిగా మారారు.

నటుడిగా మారిన ప్రముఖ సింగర్.. మ్యూజిక్ స్కూల్ అనే సినిమాలో ప్రాధాన పాత్రలో  షాన్..
Shan
Follow us on
వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ  ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సింగర్ షాన్. ఆయన ఇప్పుడు పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాష‌ల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్‌’ కోసం న‌టుడిగా మారారు. మాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  త‌న విల‌క్ష‌ణ గాత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సింగర్ షాన్ ‘మ్యూజిక్ స్కూల్’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను కూడా ఆక‌ట్టుకున్నారు. అయితే గాత్రంతోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తోనూ. ఇళ‌య‌రాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగ‌ర్‌ను చూసి, పాత్ర‌కు స‌రిపోతాడ‌ని భావించి త‌మ‌ సినిమాలో న‌టించాల‌ని చిత్ర‌ ద‌ర్శ‌క నిర్మాత‌లు కోరారు. శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్రియ మాజీ ప్రేమికుడుగా షాన్ క‌నిపించ‌బోతున్నారు. షాన్ ఈ సినిమాలో న‌టించ‌డంతో పాటు సినిమాలో పాట పాడ‌టం విశేషం. సృజ‌నాత్మ‌క‌మైన క‌ళ‌ల‌లో రెండు ర‌కాలైన పాత్ర‌ల‌ను పోషించ‌డానికి, వ‌ద్ద‌ని చెప్ప‌లేక‌పోయాన‌ని షాన్ అన్నారు.
షాన్ మాట్లాడుతూ ‘‘‘మ్యూజిక్ స్కూల్’లో భాగం కావడం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో పాట పాడ‌ట‌మే కాదు, న‌టుడిగా క‌నిపిస్తాను. న‌టించ‌డం నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. మాస్ట్రో ఇళ‌య‌రాజాగారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌టం గొప్ప విష‌యం. సృజ‌నాత్మ‌క క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని చెప్పే సినిమా ఇది. మ్యూజిక్‌లో చాలా వేరియేష‌న్స్‌ను చూపించే ఈ సినిమాలో..క‌ళ‌లు, ఆట‌లు కూడా పిల్లల జీవితంలో ముఖ్య‌మ‌ని చెబుతారు. సినిమాలోని ప్ర‌ధానాంశం నాకు వ్య‌క్తిగ‌తంగా ఎంత‌గానో న‌చ్చింది. ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తో సినిమాను చేస్తున్న పాపారావుగారికి థాంక్స్‌. అలాగే ఈ సినిమాలో పాట పాడ‌టంతో పాటు న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇది నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది ’’ అన్నారు.
యామిని ఫిలింస్ నిర్మించ‌నున్న ‘మ్యూజిక్ స్కూల్‌’  సినిమాలో  శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్‌, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, విన‌య్ వ‌ర్మ‌, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో 12 పాటలుంటాయి. పిల్ల‌ల‌కు క‌ళ‌లు, ఆట‌ల ప్రాధాన్య‌త‌ను తెలియ‌నీయ‌కుండా కేవ‌లం వారిని ఇంజనీర్లు, డాక్ట‌ర్స్‌గా చూస్తూ  మూస పద్ధతిలో ఉంటూ ఎలాంటి క్రియేటివిటీలేని నేటి విద్యావ్య‌వ‌స్థ‌లో పిల్ల‌లు తెలియ‌ని ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని చెప్ప‌డ‌మే ఈ సినిమా ప్ర‌ధానాంశం.
మరిన్ని ఇక్కడ చదవండి : 

Amitabh Bachchan : అమితాబ్ పై సల్మాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. చేసింది ఇక చాలు అంటూ..

Janhvi Kapoor: తగ్గేదే లే అంటున్న జాన్వీ కపూర్ అందాలు.. మీరు ఓ లుక్ వేయండి

Prabhakar: ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు