Chalapati Rao: టాలీవుడ్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు.. నాలుగు నెలల వ్యవధిలోనే నలుగురు దిగ్గజ నటుల కన్నుమూత

టాలీవుడ్‌కు గత మూడు నెలలు పీడకలగా మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటులుగా గుర్తింపు పొందిన రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు, సూపర్‌స్టార్‌ కృష్ణ, నవరసనటనా సార్వభౌమ కైకాల సత్య నారాయణ కన్నుమూశారు. తాజాగా మరో సీనియర్‌ నటుడు చలపతిరావు (78) హఠాన్మరణం టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Chalapati Rao: టాలీవుడ్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు.. నాలుగు నెలల వ్యవధిలోనే నలుగురు దిగ్గజ నటుల కన్నుమూత
Krishna, Kaikala,krishnamraju,chalapati Rao

Updated on: Dec 25, 2022 | 8:34 AM

టాలీవుడ్‌కు గత మూడు నెలలు పీడకలగా మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటులుగా గుర్తింపు పొందిన రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు, సూపర్‌స్టార్‌ కృష్ణ, నవరసనటనా సార్వభౌమ కైకాల సత్య నారాయణ కన్నుమూశారు. తాజాగా మరో సీనియర్‌ నటుడు చలపతిరావు (78) హఠాన్మరణం టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆదివారం (డిసెంబర్‌ 25) తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. విభిన్న పాత్రలతో తెలుగుతెరపై తనదైన ముద్ర వేశారు చలపతిరావు. చలపతిరావు హఠాన్మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

కృష్ణంరాజుతో మొదలై..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో కృష్ణం రాజు (83) ఈ ఏడాది లోనే కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన ఆయన సెప్టెంబర్‌ 11న తుదిశ్వాస విడిచారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణంరాజు మరణం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.

నటశేఖరుడి అస్తమయం..

తనదైన నటన, సాహసాలతో టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా వెలిగిన నటశేఖర కృష్ణ ఈ ఏడాదిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారత్‌ సినిమా పరిశ్రమను కుదిపేసింది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన నవంబర్‌ 15న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

నింగికేగిన కైకాల

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వేలాది సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ (87) డిసెంబర్‌ 23న కన్నుమూశారు. యముడి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఆయన మరణం టాలీవుడ్‌ను కుదిపేసింది. నిన్న (డిసెంబర్‌24) ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ విషాదం నుంచి కోలుకోకముందే చలపతిరావు కన్నుమూశారు. దీంతో గత నాలుగు నెలల వ్యవధిలోనే నలుగురు లెజెండరీ యాక్టర్లు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.

సరిగ్గా అప్పటిలాగే..

కాగా కొన్నేళ్ల క్రితం ఏవీఎస్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్‌ నారాయణ, వేణుమాధవ్‌ లాంటి కమెడియన్లు ఇలాగే నెలల వ్యవధిలో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..