AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. ఇప్పుడు సీరియల్స్‌లో మంచి గుర్తింపు

సినిమా సెలబ్రెటీల కంటే సీరియల్స్ లో నటించే నటీమణులు చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కొంతమంది సీరియల్స్ ద్వారా సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక సీరియల్స్ లో విలన్స్ గా నటించిన చాలా మంది బయట ఎంతో సెన్సిటివ్ గా ఉంటారు.

నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. ఇప్పుడు సీరియల్స్‌లో మంచి గుర్తింపు
Triveni
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2026 | 10:52 AM

Share

సీరియల్స్ లో తమ నటనతో ఎంతో మంది నటీమణులు ఎదురుచూస్తున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు సీరియల్స్ తో మంది క్రేజ్ తెచ్చుకొని సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు.. అంతే కాదు సినిమాలకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు వస్తున్న సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ సీరియల్స్ కు మంచి క్రేజ్ ఉంది.. సాయంత్రం ఐతే చాలు ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్ ను తెగ చూస్తున్నారు. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ నటించిన చాలా మందికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదే సీరియల్ తో పాపులర్ అయినా వారిలో శ్రీవల్లి ఒకరు. ఆమె సీరియల్ లో నెగిటివ్ పాత్రలో మెప్పించింది ఆమె..

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

సీరియల్ లో తన పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది శ్రీవల్లి. ఆమె అసలు పేరు. ఏకే త్రివేణి.. ఈ చిన్నది సీరియల్ లో నెగిటివ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. సీరియల్ లో విలన్ గా నటించిన ఆమె బయటం మాత్రం చాలా సెన్సిటివ్. ఆమె ఎన్నో కష్టాలు పడింది. సీరియల్స్ లో నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడింది. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూసింది ఆమె..

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు.. తండ్రి చనిపోయాడు! పట్టించుకోని మద్దతు ఇచ్చే బంధువులు లేరు.. పిల్లలను పెంచడానికి తల్లి ఎన్నో కష్టాలు పడింది. ఇక తల్లి కష్టాలు చూస్తూ పెరిగిన ఈ త్రివేణి చదువు కూడా డిగ్రీ మధ్యలోనే ఆపేసింది.. తల్లికి మద్దతు ఇవ్వడానికి ఆమెకు నచ్చిన యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.. ఎన్నో సినిమాల్లో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసిన త్రివేణి.. తమిళ్ సుందరి సీరియల్ లో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సీరియల్స్, సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో విలన్ గా నటిస్తుంది. సీరియల్స్ లోకి వచ్చిన సమయంలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారట. నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారట.. మొదట్లో అవకాశాలు కూడా సరిగా వచ్చేవి కాదని ఇప్పుడు మెల్లగా అదృష్టం బాగుండి అవకాశాలు వస్తున్నాయి.. తన తల్లి ఎంతో సపోర్ట్ చేస్తుందని  అని ఏకే త్రివేణి తెలిపింది.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us