AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Madhavi: చిరంజీవితో ఎన్నో హిట్స్.. ఈ హీరోయిన్ కూతుర్లను చూశారా.. ? అందంలో అప్సరసలు..

సీనియర్ హీరోయిన్ మాధవి.. ఒకప్పుడు అందంతోపాటు.. గ్లామర్ పాత్రలతో అలరించింది. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అలాగే మాతృదేవోభవ సినిమాతో ప్రేక్షకులను ఏడిపించింది. అందులో ఆమె నటకు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టారు. ఒకప్పుడు సినీరంగంలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

Actress Madhavi: చిరంజీవితో ఎన్నో హిట్స్.. ఈ హీరోయిన్ కూతుర్లను చూశారా.. ? అందంలో అప్సరసలు..
Madhavi
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2025 | 11:03 AM

Share

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మాధవి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె అసలు పేరు కనక విజయలక్ష్మి. చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్న మాధవి.. ఆ తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ రావడంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మాధవి తల్లి కూడా భరతనాట్యం కళాకారిణి కావడం విశేషం. 13 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మాధవి చాలా త్వరగా స్టార్ డమ్ కు ఎదిగింది. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించింది. అప్పట్లో వీరిద్దరి జోడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. చిరంజీవితోపాటు కృష్ణ, శోభన్ బాబు, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రాల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

భారతీయ సినిమా ప్రపంచంలో దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది. 1996లో రాల్ఫ్ శర్మ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇప్పుడు తమ భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివసిస్తుంది. ఈ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం వ్యాపారాల్లో బిజీగా ఉన్న ఆమె.. సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటుంది. తాజాగా మాధవి ముగ్గురు కూతుర్ల ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నారు.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

మాధవి కూతుర్లు హీరోయిన్స్ మాదిరిగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వీరు ముగ్గురు సినిమాలకు దూరంగా ఉంటూ విభిన్న రంగాల్లో సెటిల్ అయినట్లుగా తెలుస్తోంది. అటు భర్తతో కలిసి వ్యాపారం చూసుకుంటున్న మాధవి.. ఇటు సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

Madhavi Daughters

Madhavi Daughters

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

Follow Us