Akkineni Nagachaitanya: చైతూకీ జోడిగా అలనాటి హీరోయిన్ కూతురు.. ఎవరంటే..

ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాలో అలనాటి హీరోయిన్

Akkineni Nagachaitanya: చైతూకీ జోడిగా అలనాటి హీరోయిన్ కూతురు.. ఎవరంటే..
Nagachaitanya

Updated on: Sep 06, 2022 | 8:05 PM

ఇటీవలే థాంక్యూ.. లాల్ సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya). ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో చైతూ తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మాలా శ్రీ కూతురు రాథనా రామ్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే రాథనా రామ్ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. డీ56 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్.. రాక్ లైన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తుండగా.. తరుణ్ సుధీర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా రాథనా రామ్‏కు తెలుగుతోపాటు ఇతర భాషల నుంచి ఎక్కువగానే ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు చైతూ.. పరశురామ్ కాంబోలో రాబోతున్న మూవీలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.