ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన నటీమణుల్లో రోజా(Roja) ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రోజా. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు రోజా. ప్రస్తుతం రోజా రాజకీయాలులో రాణిస్తున్నారు రోజా.. తాజాగా ఆమె కూతురు అన్షుమాలిక సినీ ఎంట్రీ గురించి ఈమధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి. త్వరలోనే అన్షుమాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్. అన్షుమాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని రోజా అభిమానులు అంటున్నారు. ఇటీవలే అన్షుమాలిక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు ఆమెకు ఉన్నాయని.. అన్షుమాలిక సినిమాల్లోకి రావాలని రోజా అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అన్షుమాలిక ఓ స్టార్ హీరో కొడుకుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాతో అన్షుమాలిక ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించాడు ధృవ్. అయితే అనుకున్న రేంజ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. ఇప్పుడు కొత్త సినిమాతో హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు. కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోంది. త్వరలోనే అన్షుమాలిక ఎంట్రీని కన్ఫామ్ చేస్తారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అన్షుమాలిక కానీ రోజా కానీ స్పందించాల్సిందే.. మొన్నామధ్య పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు రోజా.. ఇప్పుడు టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు.