ఈ మూవీ కోసం మొదటి సారి డైలాగ్స్ బట్టీపట్టాల్సి వచ్చింది.. ఆసక్తికర విషయాలను పంచుకున్న సీనియర్ హీరోయిన్..

అలనాటి సీనియర్ హీరోయిన్ ఆమని.. తెలుగు ప్రేక్షకులకు ఒక ఫ్యామిలీ హీరోయిన్‏గా గుర్తుండిపోయింది. దాదాపు అగ్రహీరోలందరితో

  • Rajitha Chanti
  • Publish Date - 2:47 pm, Sun, 14 March 21
ఈ మూవీ కోసం మొదటి సారి డైలాగ్స్ బట్టీపట్టాల్సి వచ్చింది.. ఆసక్తికర విషయాలను పంచుకున్న సీనియర్ హీరోయిన్..
Aamani

అలనాటి సీనియర్ హీరోయిన్ ఆమని.. తెలుగు ప్రేక్షకులకు ఒక ఫ్యామిలీ హీరోయిన్‏గా గుర్తుండిపోయింది. దాదాపు అగ్రహీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమని. వెండితెరపై భార్య పాత్రలో నటించి మెప్పించడంలో ఆమని సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమని సెకండ్ ఇన్సింగ్స్‏లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా చావు కబురు చల్లగా. ఇందులో ఆమని గంగమ్మ అనే కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా గురించి ఆమని మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ముందుగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నప్పుడు నన్ను చావు కబురు చల్లగా సినిమాలో నటించమని బన్నీ వాసు అడిగారు. దీంతో నేను స్టోరీ ఎంటీ.. పాత్ర ఎంటీ అని అడగకుండానే ఒప్పుకున్నాను. ఇందులోని ప్రతి సన్నివేశం అనుభవం ఉన్న దర్శకునిలా తీశారు అంటూ చెప్పుకోచ్చింది ఆమని. నా సినీ జీవితంలో ఏ సినిమాకు ముందు రోజు స్క్రిప్ట్ తీసుకెళ్ళి డైలాగులు నేర్చుకోలేదు. కానీ చావు కబురు చల్లగా సినిమాకు వైజాగ్ యాసలో పెద్ద పెద్ద మాస్ డైలాగ్స్ చెప్పాల్సి రావడంతో రాత్రిళ్ళు బట్టీ పట్టి ఉదయం షూటింగ్ లో పాల్గోనేదాన్ని. ఈ సినిమాలోని గంగమ్మ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది అని తెలిపారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ప్రకాశ్ రాజ్ గారితో నటించాలంటే భయం వేసింది. ఆయన ఎంత పెద్ద డైలాగ్ అయిన ఒకే టేక్ లో చెప్తారు. ఆయనతో నటించేటప్పుడు నాకు రెండో టేక్ తీసుకోవాలంటే భయం వేసింది. నాకు డ్రీమ్ ఎంటంటే విలన్ పాత్రలు చేయాలని అంటూ మనసులోని మాటలను బయటపెడ్డింది ఆమని. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పమలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.

Also Read:

తెలుగులో అలరించేందుకు సిద్ధమవుతున్న టాప్ బాలీవుడ్ హీరోయిన్లు.. ఎవరు ఏ హీరోతో సినిమాలు చేస్తున్నారో తెలుసా..

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..