సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు ఎస్సీ జననాథన్ ఆదివారం కన్నుముశారు.

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..
Director Sp Jananathan
Follow us

|

Updated on: Mar 14, 2021 | 1:35 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు ఎస్సీ జననాథన్ ఆదివారం కన్నుముశారు. జననాథన్ అకాలమరణంపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జననాథన్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారని డైరెక్టర్ ఆర్ముగకుమార్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.

ప్రస్తుతం జననాథన్ విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లాబాం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. గత గురువారం ఆయన సినిమా ఎడిటింగ్ పనిలో ఉన్న సమయంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. చాలా సమయం గడుస్తున్న జననాథన్ తిరిగి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన సిబ్బంది ఆయన ఇంటికి వెళ్ళి చూశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు తెలిపారు. అనంతరం వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే జననాథన్ ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్నుముశారు. విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ కాంబోలో తెరకెక్కిన లాబాం సినిమాను ఈ సంవత్సరం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2004లో విడుదలైన అయ్యర్ కై సినిమాకు తమిళంలో జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకున్నారు. డైరెక్టర్ జననాథన్ మృతిపై హీరోయిన్ శ్రతిహాసన్ సంతాపం ప్రకటించారు. భారమైన హృదయంతో గుడ్ బై చెబుతూ ట్వీట్ చేశారు. “ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. నా ఆలోచనలలో ఎప్పుడూ ఆయన బతికే ఉంటారు” అంటూ ట్వీట్ సంతాపం ప్రకటించింది.

Also Read:

ర్యాప్ సింగర్ హానీసింగ్‏తో కలిసి ‘స్ట్రిప్ టీజ్’ చేసిన బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!