AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sashi Musical Concert Pre Release Event LIVE : రానా ముఖ్య అతిధిగా ఆది సాయికుమార్ ‘శశి’ ప్రీ మ్యూజికల్ కార్యక్రమం

డైలాగ్ కింగ్ తనయుడు ఆది చాలా గ్యాప్ తర్వాత శశి సినిమాతో వెండి తెర ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ప్రేమ, పెళ్లి , మీ మూర్ఖత్వం వంటి డైలాగ్స్ తో కట్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.. తాజాగా రానా శశి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ...

Sashi Musical Concert Pre Release Event LIVE : రానా ముఖ్య అతిధిగా ఆది సాయికుమార్ 'శశి' ప్రీ మ్యూజికల్ కార్యక్రమం
Aadi Shashi Film Event
Surya Kala
|

Updated on: Mar 14, 2021 | 7:02 PM

Share

Sashi​ Musical Concert Pre Release Event LIVE : డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చిన ఆది.. తనదైన యాక్టింగ్‌తో ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డైలాగ్స్ తోనే కాదు డ్యాన్స్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని లవ్లీ రాకింగ్‌ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఆది తన ట్యాలెంట్‌తో.. యూత్‌ ఫుల్ సినిమాలతో కుర్రాళ్లను ఫిదా చేయడమే కాదు.. తన హ్యాండ్సమ్‌ లుక్స్‌తో అమ్మాయిలను కూడా తన చుట్టు తిప్పుకున్నాడు. ఇలా టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లోనే వన్‌ ఆఫ్ ది టాలెంటెడ్‌.. అండ్ యంగ్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకుని కెరీర్‌ మొదట్లో వరుస సినిమాల్లో అవకాశాలు ప్టటేశాడు ఆది.

చాలా గ్యాప్ తీసుకున్న ఆది తాజాగా ఓ లవ్అండ్‌ రొమాంటిక్‌ డ్రామా తో వెండి తెర ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాడు.. తాజాగా “శశి” సినిమాను సిద్ధం చేసేశాడు. ఆది, సురభి హరోహీరోయిన్‌లుగా శ్రీనివాస నాయుడు నడికట్ల డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం “శశి”. ఈ సినిమాను శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రానా వస్తున్నాడు..

ఇక ఈ చిత్రాన్ని మార్చి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా ఈ మూవీ టీం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు .. శశి సినిమా టీం మొత్తం విచ్చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని టీవీ 9 లైవ్ లో ప్రసారం చేస్తుంది.