AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SriVidya: ప్రియుడి కోసం మతం మార్చుకుంది.. చివరకు ఆ ప్రేమకే బలైంది.. ఆ హీరోయిన్ జీవితం విషాదాంతం..

వెండితెరపై ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలకు ఆమె పలికించే భావోద్వేగాలకు అడియన్స్ మనసులను కదిలించాయి. స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా ఆమె జీవితం మాత్రం విషాదాంతం. ప్రియుడి కోసం మతం మార్చుకుని చివరకు ఆ ప్రేమకే బలైంది. కమల్ హాసన్ సినిమాలోని ఓ హీరోయిన్ తన కలల మనిషిని పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకుంది. కానీ ఆమె భర్త హీరోయిన్‌ని మోసం చేసి

SriVidya: ప్రియుడి కోసం మతం మార్చుకుంది.. చివరకు ఆ ప్రేమకే బలైంది.. ఆ హీరోయిన్ జీవితం విషాదాంతం..
Srividya
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2024 | 1:52 PM

Share

దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ శ్రీవిధ్య. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో 800 సినిమాలపైగా నటించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత కథానాయికగా.. సహాయ నటిగా.. తల్లి పాత్రలలో కనిపించింది. వెండితెరపై ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలకు ఆమె పలికించే భావోద్వేగాలకు అడియన్స్ మనసులను కదిలించాయి. స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా ఆమె జీవితం మాత్రం విషాదాంతం. ప్రియుడి కోసం మతం మార్చుకుని చివరకు ఆ ప్రేమకే బలైంది. కమల్ హాసన్ సినిమాలోని ఓ హీరోయిన్ తన కలల మనిషిని పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకుంది. కానీ ఆమె భర్త హీరోయిన్‌ని మోసం చేసి ఆస్తినంతా దోచుకున్నాడు. ఆమె జీవితం తరువాత విషాదకరంగా ముగిసింది. తనే శ్రీవిధ్య.

శ్రీవిద్య 1953లో చెన్నైలో జన్మించింది. తమిళ సినీ హాస్యనటుడు కృష్ణ మూ, కర్ణాటక సంగీత గాయని వసంత కుమారి దంపతుల కుమార్తె. మొదట్లో శ్రీవిద్య తండ్రి ముఖ కండరాలు దెబ్బతినడంతో నటనకు స్వస్తి పలికారు. దీంతో శ్రీవిద్య 13 ఏళ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కథానాయికగా మారింది.1967లో శివాజీ గణేశన్ నటించిన తిరువరుట్ సెల్వర్ చిత్రం ద్వారా శ్రీవిద్య తెరంగేట్రం చేసింది. ఆమె 1970ల మధ్యకాలంలో తమిళ, తెలుగు చిత్రసీమలో అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా మారింది. కమల్ నటించిన అపూర్వ రాగంగళ్ చిత్రం శ్రీవిద్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వరుస సినిమాలో సినిమాలు చేస్తున్న సమయంలోనే మలయాళ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన జార్జ్ థామస్‌తో శ్రీవిద్య ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమకు శ్రీవిద్య కుటుంబం వ్యతిరేకించింది. ఎందుకంటే జార్జ్ థామస్ క్రిస్టియన్ కావడంతో తమ కూతురు పెళ్లి చేసుకోవడానికి వారు అంగీకరించలేదు. అయితే శ్రీవిద్య తన కుటుంబ సభ్యులను వ్యతిరేకంగా తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది.

ఆ తర్వాతే ఆమె జీవితంలో విషాదాలు మొదలయ్యాయి.పెళ్లయ్యాక సరిపడా ఆదాయం లేకపోవడంతో జార్జ్ థామస్ శ్రీవిద్యను నటనను కొనసాగించాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరగడంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.శ్రీవిద్య తన భర్త జార్జ్‌తో విడాకులు తీసుకోగా, జార్జ్ ఆమెకు రావాల్సిన ఆస్తి ఏమీ ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై శ్రీవిద్య సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడింది. 2003లో శ్రీవిద్య అనేక శారీరక సమస్యలతో బాధపడుతుండగా ఆమెకు క్యాన్సర్ సోకింది. దాన్నుంచి తేరుకోలేక 2006లో శ్రీవిద్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.