Tollywood: గుడి ముందు కొంగు పట్టుకుని భిక్షాటన చేసిన సీనియర్ హీరోయిన్.. వీడియో వైరల్.. ఏమైందంటే?

80, 90వ దశకంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. ఆ తర్వాత సహాయ నటిగా, విలన్ గా, కమెడియన్ గా మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషా సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది.

Tollywood: గుడి ముందు కొంగు పట్టుకుని  భిక్షాటన చేసిన సీనియర్ హీరోయిన్.. వీడియో వైరల్.. ఏమైందంటే?
Actress Nalini

Updated on: Jul 20, 2025 | 10:45 AM

80, 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ హీరోయిన్ గుడిమెట్ల‌పై భిక్షాట‌న చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ఆమె ఓ ప్రముఖ ఆలయం ఎదుట కొంగు పట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. అయితే ఆమె ఇలా భిక్షాట‌న చేయ‌డానికి కార‌ణం త‌న ఆర్థిక ప‌రిస్థితి కాదు. దేవునిపై ఆ నటికి ఉన్న న‌మ్మ‌కం. అమ్మవారిపై తనకున్న భ‌క్తి కార‌ణంగా ఆమె భిక్షాట‌న చేశారు. ఇలా భిక్షాటనతో వార్తల్లో నిలిచిన ఆ న‌టి మ‌రెవ‌రో కాదు 80, 90 వ దశకంలో త‌న అందంతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిన నళిని. శుక్రవారం (జులై 18) తిరువేర్కడులోని కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట కొంగు పట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేసిందామె. ఆమె చేసిన పనిని చూసి చాలామంది భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం గురించి నళిని మీడియాతో మాట్లాడారు.. ‘అమ్మవారు కలలో కనిపించి తనకోసం ఏం చేస్తావని అడిగింది. తన కోసం ఏం చేయాలో తోచక ఇలా కొంగుపట్టి భిక్షం అడుగుతున్నాను. నాకు భిక్షగా వచ్చిన కానుకలను, డబ్బును ఆ అమ్మవారికే కానుకగా సమర్పించాను’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గుడి ముందు భక్తులతో నటి నళిని..

సీరియల్స్ తో బిజి బిజీగా..

రజనీకాంత్‌, చిరంజీవి మల్టీస్టారర్‌ రణువ వీరన్‌ (1981) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నళిని. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఇంటిగుట్టు, వీడే, సీతయ్య, పున్నమినాగు, నువ్వెకుండటే నేనక్కడుంటా, ఒక్క అమ్మాయి తప్ప వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించిన నళిని 1988లో నటుడు రామరాజన్‌ను పెళ్లాడారు. వీరికి అరుణ, అరుణ్‌ అని కవలలు సంతానం. పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్ తో బిజీగా ఉంటున్నారు నళిని.

అమ్మవారిపై నమ్మకంతోనే ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..