AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR:ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో.. సరికొత్తగా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. తారక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో

Jr.NTR:ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో.. సరికొత్తగా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్..
Ntr Koratala Moive
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2022 | 8:21 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. తారక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన ఈ మూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో మెగా, నందమూరి అభిమానులు నిరాశ పడ్డార. ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ.. మరే ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పలేదు తారక్. దీంతో ఎన్టీఆర్ నుంచి మరో మూవీ రాలేదు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీట్ కావడంతో తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు తారక్.

ప్రస్తుతం ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22 న విడుదల చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు డైరెక్టర్. ఇందులో తారక్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగారు రాజశేఖర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ సినిమాతో ప్రేక్షకు ముందుకు రాబోతున్నారు రాజశేఖర్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రాజశేఖర్ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్ ఈసారి లీడ్ రోల్ కాకుండా స్టారో హీరోకు బాబాయిగా నటించనున్నాడట. ఇందులో ఆయనది పవర్ రోల్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై