తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు: నరేష్

తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో మొదలైంది. తరువాత హైదరాబాద్ కు తరలి వచ్చింది. ఈ రోజు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ఆడుతున్నాయి. ఇది తెలుగు వారికి గర్వకారణం. ఎంతో మంది మహానుభావులు వారియొక్క శ్రమ, పట్టుదల, త్యాగం, క్రియేటివిటీల ఫలితంగా ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచమంతా పేరుతెచ్చుకుంది. అయితే ఏ ఒక్క పనికైనా ఆద్యుడు అనేవాడు ఉంటాడు. తెలుగు సినిమా పరిశ్రమకి ఆద్యుడు.. తెలుగు సినిమా పితామహుడు.. శ్రీ రఘుపతి […]

తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు: నరేష్
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 28, 2019 | 6:12 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో మొదలైంది. తరువాత హైదరాబాద్ కు తరలి వచ్చింది. ఈ రోజు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ఆడుతున్నాయి. ఇది తెలుగు వారికి గర్వకారణం. ఎంతో మంది మహానుభావులు వారియొక్క శ్రమ, పట్టుదల, త్యాగం, క్రియేటివిటీల ఫలితంగా ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచమంతా పేరుతెచ్చుకుంది. అయితే ఏ ఒక్క పనికైనా ఆద్యుడు అనేవాడు ఉంటాడు. తెలుగు సినిమా పరిశ్రమకి ఆద్యుడు.. తెలుగు సినిమా పితామహుడు.. శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు. మచిలీపట్నంలో జన్మించి చెన్నైకి తరలివచ్చి, తిరుగులేని ఫోటోగ్రాఫర్ గా పేరుతెచ్చుకుని.. తన ఆస్తి అంతా కూడా త్యాగం చేసి మొదటి స్టూడియో నిర్మించారు. తెలుగు సినిమాని శ్రీలంక దాకా తీసుకెళ్లారు. వీరి పేరుతో నేషనల్ అవార్డు కూడా ఉంది. అయితే కేవలం నిర్మాతగానే కాకుండా ఒక సినిమా ప్రేమికుడిగా.. మెగాఫోన్ ని.. ఆయన ఆస్తి అంతా తాకట్టుపెట్టి తీసుకొచ్చి.. తెలుగు సినిమాని ప్రపంచమంతా విస్తరింపచేశారు. చెన్నైలో ధియేటర్ స్థాపించారు. ఈ విధంగా రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు సినిమా పితామహుడుగా నిలిచారు.

అమ్మకి శ్రీ రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తున్న రోజున మెస్మరైజ్ అయ్యాను. గూగుల్ లో శోధించి ఆయన గురించి తెలుసుకున్న తరువాత నేను మంత్ర ముగ్ధుణ్ణి అయ్యాను. ఆ తరువాత మా దర్శకుడు బాబ్జికి ఫోన్ చేసి ఈ సినిమా తీద్దాం అని చెప్పాను. నిర్మాత మండవ సతీష్ కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారిద్దరు కూడా నా వెనుక రెండు స్తంభాలుగా నిలబడ్డారు. ఇప్పటివరకు ఈ చిత్రం 40 రోజులు షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను ఒక కమర్షియల్ ఫార్మాట్ లో తీస్తున్నాము. రఘుపతి వెంకయ్య గారి పాత్ర ధరించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. దాసరి గారు ఈ సినిమా నిర్మించాలనుకున్నారు. కానీ అనుకోకుండా వారు స్వర్గస్తులు అవడంతో ఈ సినిమా కాస్త ఆలస్యమవుతోంది. రఘుపతి వెంకయ్య బయోపిక్ లో నేను నటించడం.. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని సీనియర్ నటుడు నరేష్ తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu