వర్మ : ఇతడో వివాదం..ఇతడో విచిత్రం

రామ్ గోపాల్ వర్మ..ఈ పేరుకు ఒక హిస్టరీ ఉంది. దాన్ని అతను ఇప్పుడు మిస్టరీగా మార్చేశారు అది వేరే విషయం. టాలీవుడ్ రూపు రేఖలు మార్చిన దర్శకుడు..ఇప్పుడు వివాదాలతో కాలం నెట్టుకొస్తున్నారు. వర్మని కొంతమంది మ్యూజియంలో ఉంచాల్సిన విలువైన వ్యక్తి అంటారు. మరికొందరు అడవిలోకి నెట్టేసి..బయటకు రాకుండా చుట్టూ బారీకేడ్లు పెట్టాలంటారు. అసలు ఏది అడవో, ఏది మ్యూజియమో తెలిసిన ఏకైక వ్యక్తి వర్మే అనేవాళ్లు కూడా లేకపోలేదు. ‘శివ’తో తెలుగు సినిమా కెరీర్‌ను కూడా ఓ […]

వర్మ : ఇతడో వివాదం..ఇతడో విచిత్రం
Ram Naramaneni

|

Nov 28, 2019 | 1:36 PM

రామ్ గోపాల్ వర్మ..ఈ పేరుకు ఒక హిస్టరీ ఉంది. దాన్ని అతను ఇప్పుడు మిస్టరీగా మార్చేశారు అది వేరే విషయం. టాలీవుడ్ రూపు రేఖలు మార్చిన దర్శకుడు..ఇప్పుడు వివాదాలతో కాలం నెట్టుకొస్తున్నారు. వర్మని కొంతమంది మ్యూజియంలో ఉంచాల్సిన విలువైన వ్యక్తి అంటారు. మరికొందరు అడవిలోకి నెట్టేసి..బయటకు రాకుండా చుట్టూ బారీకేడ్లు పెట్టాలంటారు. అసలు ఏది అడవో, ఏది మ్యూజియమో తెలిసిన ఏకైక వ్యక్తి వర్మే అనేవాళ్లు కూడా లేకపోలేదు. ‘శివ’తో తెలుగు సినిమా కెరీర్‌ను కూడా ఓ మలుపు తిప్పిన వర్మ..ఇటీవల ‘జీఎస్టీ’ అంటూ పక్కా బూతు బొమ్మను తెరకెక్కించి విమర్శలు మూటగట్టుకున్నారు. ఇక ‘శివ’తో నాగార్జునకి ఎంత బ్లాక్ బాస్టర్ ఇచ్చారో..’ఆఫీసర్’ తో అదే స్థాయి డిజాస్టర్‌ను ఇచ్చారు.

రాత్రి వోడ్కా మత్తులో వివాదస్పద ట్వీట్లు చెయ్యడం..తెల్లారాక వాటిని తన తెలివితేటలతో కొట్టిపారేయడం ఈ క్రేజీ డైరెక్టర్ స్టైల్. ఇండియన్ ‘లా’ లో ఉన్న లూప్ హోల్స్‌ని వర్మ స్థాయిలో వినియోగించుకున్న మరొక వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. వర్మకి శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరు. ఎందుకుంటే..దేవుళ్లను తిడతాడు, తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకుంటాడు. అమ్మాయిలపై లేనిపోని వ్యాఖ్యలు చేసి తిట్లు తింటాడు..మళ్లీ స్త్రీ హక్కుల కోసం పోరాటం చేసేవారికి మద్దతు తెలుపుతాడు . వివాదస్పద వ్యక్తుల జీవిత చరిత్రలను తెరకెక్కిస్తాడు. మళ్లీ ఇది కేవలం కల్పితం అంటాడు. వర్మ మొండోడు, తెలివైనోడు, మంచోడు….పిచ్చోడు కూడా. మాఫియా డాన్స్‌తో స్నేహాలు, ముంబై పేలుళ్లపై సినిమాలు, రాజకీయ నాయకులతో వైరాలు, మీడియా ప్రముఖులతో సావాసాలు…ఏంటో ఈ వర్మ అంతా డిఫరెంట్. తాజాగా  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ ఏపీ రాజకీయాలపై ఓ సెటైరికల్ మూవీని ప్లాన్ చేశారు. ఆ టైటిల్‌పై వివాదం రావడంతో టీవీ9 స్టూడియోలో కూర్చోని టీ తాగినంత సింపుల్‌గా టైటిల్‌ని మార్చేశారు. ఇంతకీ చిత్ర తాజా టైటిల్ ఏంటంటే.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఇక ఓ సివిల్స్ టాపర్ నాకు ఆర్జీవీ తనకు ఆదర్శం అని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. రచయిత్రి అయాన్ రాండ్ ప్రభావం వర్మపై ఎంత ఉందో తెలీదు కానీ వర్మ ఇంపాక్ట్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉందన్న మాట మాత్రం వాస్తవం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu