AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్‌ను హర్ట్ చేసిన మలయాళ కుట్టీ.. ఇరిటేషన్‌గా ఉందన్న రౌడీ

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను ఓ మలయాళ హీరోయిన్ హర్ట్ చేసింది. విజయ్ ముందే ఆయన నటించిన చిత్రాన్ని ఏకిపారేసింది. ఇది కాస్త ఆయనకు ఇబ్బందిగా కలిగించినా.. ఆమె వ్యాఖ్యలకు నిదానంగానే సమాధానం ఇచ్చాడు మన రౌడీ. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన ముందే మాట్లాడినందుకు సోషల్ మీడియాలో ఆ హీరోయిన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. అంతే.. ‘‘చాలా ఇరిటేషన్‌గా ఉన్నాను. ఆ ఇంటర్వ్యూను […]

విజయ్‌ను హర్ట్ చేసిన మలయాళ కుట్టీ.. ఇరిటేషన్‌గా ఉందన్న రౌడీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 28, 2019 | 2:27 PM

Share

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను ఓ మలయాళ హీరోయిన్ హర్ట్ చేసింది. విజయ్ ముందే ఆయన నటించిన చిత్రాన్ని ఏకిపారేసింది. ఇది కాస్త ఆయనకు ఇబ్బందిగా కలిగించినా.. ఆమె వ్యాఖ్యలకు నిదానంగానే సమాధానం ఇచ్చాడు మన రౌడీ. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన ముందే మాట్లాడినందుకు సోషల్ మీడియాలో ఆ హీరోయిన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. అంతే.. ‘‘చాలా ఇరిటేషన్‌గా ఉన్నాను. ఆ ఇంటర్వ్యూను నా మైండ్‌లో నుంచి తీసేయాలనుకుంటున్నా. అది అలానే ఉంటే.. నా లోపల ఓ పుండులాగా పెరుగుతూ ఉంటుంది’’ అని అన్నాడు. ఇంతకు విజయ్‌ను హర్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు..? అసలు మ్యాటరేంటంటే..!

వివిధ భాషలకు చెందిన స్టార్‌ నటీనటులను బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. అందులో దీపికా పదుకునే, మనోజ్ బాజ్‌పేయి, విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, రణ్‌వీర్ సింగ్, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, పార్వతీ మీనన్(బెంగళూరు డేస్ ఫేమ్) పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా పార్వతీ మీనన్ మాట్లాడుతూ.. దేవరకొండ సెన్సేషనల్ చిత్రం అర్జున్ రెడ్డిపై కామెంట్లు చేసింది. జోకర్‌, అర్జున్ రెడ్డిని కంపేర్ చేసిన పార్వతీ మీనన్.. జోకర్‌లో అన్ని వాస్తవీకతకు దగ్గరగా ఉంటాయని తెలిపింది. అందులో హీరో అందరినీ చంపడం కరెక్ట్‌ అనే అనిపించిందని.. కానీ అర్జున్ రెడ్డిలో హీరో, హీరోయిన్‌ను కొట్టే సన్నివేశాన్ని చూసి షాక్ అయ్యాననిపేర్కొంది. అంతేకాదు ఈ సన్నివేశం వయొలెన్స్‌ను పెంచేలా ఉందని కూడా తెలిపింది. ఇక ఇలాంటి సినిమాలను తీసే దర్శకులను తాను ఆపలేనని.. కానీ అలాంటి సినిమాల్లో మాత్రం తాను నటించనని తేల్చి చెప్పేసింది.

దీంతో వెంటనే స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘‘ఇద్దరు నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు పడుతుంటడం, ఒకరిని ఒకరు కొట్టుకోవడం సాధారణంగా జరుగుతుంటాయి. ఏదైనా సన్నివేశాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రేమలో ఉన్న చాలామందికి ఆ సన్నివేశం నచ్చింది. కానీ ఇంట్లో అమ్మ నాన్న తరచుగా గొడవ పడటం చూసిన వారికి అలాంటి సన్నివేశం కాస్త భయాన్ని కలిగిస్తుంది. ఏదైనా సినిమాపై మనిషి కారెక్టర్ ఉండదు. సమాజానికి హాని కలిగించే సినిమాలకు నేను దూరంగానే ఉంటా’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఈ వీడియో బయటకు వచ్చాక నెటిజన్లు పార్వతీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. ఒక నటుడి ముందే అతడు నటించిన సినిమా గురించి మాట్లాడేందుకు ధైర్యం కావాలంటూ కామెంట్లు చేశారు. ఇక దీంతో కాస్త అసహనానికి గురైన విజయ్ దేవరకొండ చాలా ఇరిటేషన్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. ఐఎఫ్ఎఫ్‌ఐలో పాల్గొన్న విజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ ఇంటర్వ్యూను నేను గుర్తుపెట్టాలనుకోవడం లేదు. పార్వతీ చెప్పిన కొన్ని విషయాలతో నేను ఏకీభవిస్తా. కానీ సోషల్ మీడియా హడావిడి చూస్తుంటే నాకు ఇరిటేషన్‌గా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.

నిజానికి చెప్పాలంటే అర్జున్ రెడ్డి.. ఓ కల్ట్ మూవీ. టాలీవుడ్‌లో ఈ చిత్రం ఓ సెన్సేషన్‌కు తెరతీసింది. దీనిపై ప్రముఖులందరూ అద్భుతం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు ఈ మూవీతోనే విజయ్ దేవరకొండకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్ రావడంతో పాటు సెన్సేషనల్ హీరో అని బిరుదు కూడా వచ్చింది. ఇక ఇదే చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేయగా.. అక్కడి తన సత్తాను చాటింది. కానీ ఈ మూవీ చాలా మంది క్రిటిక్‌లకు నచ్చలేదు. బాలీవుడ్‌లోనూ చాలా మంది ఈ మూవీని వరెస్ట్ అంటూ రివ్యూలు ఇచ్చారు. వారి రివ్యూలు ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం చాలా కనెక్ట్ అయ్యింది.

Follow Us