Kaikala Sathyanarayana: ముఖ్యమంత్రి జగన్‏కు లేఖ రాసిన కైకాల సత్యనారాయణ.. ప్రత్యేక శ్రద్ధ తనను కదిలించిందంటూ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‏కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తన అనారోగ్య సమయంలో

Kaikala Sathyanarayana: ముఖ్యమంత్రి జగన్‏కు లేఖ రాసిన కైకాల సత్యనారాయణ.. ప్రత్యేక శ్రద్ధ తనను కదిలించిందంటూ..
Kaikala

Updated on: Jan 20, 2022 | 11:25 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‏కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించి ప్రత్యేక శ్రద్ద చూపించడం సంతోషమేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‏కు కైకాల ఓ లేఖ రాశారు. గతేడాది నవంబర్‏లో తీవ్ర అనారోగ్యంతో కైకాల సత్యనారాయణ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడ ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న కైకాల ఏపీ సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు.

అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని ఆయన అన్నారు.

Satyanarayana

మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది, ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల పేర్కొన్నారు. అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్న, అని చెబుతూ ఆయన నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు. తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు కొడుకు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని ఆయన వెల్లడించారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..