Chalapathi Rao: టాలీవుడ్‏లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని

Chalapathi Rao: టాలీవుడ్‏లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత..
Chalapathi Rao

Updated on: Dec 25, 2022 | 8:00 AM

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. చలపతిరావు తిరిగిరాని లోకాలకు వెళ్లారనే వార్త తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరనిలోటన్నారు సినీ దిగ్గజాలు.

ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న సీనియర్ నటుడు చలపతిరావు‌ను సినిమా వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది.

1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. తండ్రి మణియ్య. తల్లి వియ్యమ్మ, 1944 మే 8న పుట్టిన చలపతిరావుకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు..కుమారుడు రవిబాబు టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.