Sekhar Kammula: ఆ హీరోయిన్‌తో అనవసరంగా సినిమా చేశా.. ఓపెన్‌గా చెప్పేసిన శేఖర్ కమ్ముల

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబకథలను తెరకెక్కించడం లేదు శేఖర్ కమ్ముల దిట్ట. శేఖర్ కమ్ముల సినిమాలే కాదు ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకునే హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. కుటుంబ కథలను అందంగా తెరకెక్కించి ప్రేక్షకులకు అందిస్తారు శేఖర్ కమ్ముల.

Sekhar Kammula: ఆ హీరోయిన్‌తో అనవసరంగా సినిమా చేశా.. ఓపెన్‌గా చెప్పేసిన శేఖర్ కమ్ముల
Sekhar Kammula

Updated on: Jun 16, 2025 | 9:27 AM

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు అంటే టక్కున చెప్పే పేరు శేఖర్ కమ్ముల.. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది . శేఖర్ కమ్ముల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనో.. లేదా మన పక్క ఇంట్లోనో జరిగిన కథల్లానే ఉంటాయి. అందమైన ప్రేమ కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నారు.

ఇప్పటివరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ సినిమాకు కుభేర అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు నాగార్జున కూడా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్ తో అనవసరంగా సినిమా చేశాను అని అన్నారు శేఖర్ కమ్ముల. ఆమెతో సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అన్నారు. ఇంతకూ ఆహీరోయిన్ ఎవరో తెలుసా.?ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. శేఖర్ కమ్ముల నయనతారతో అనామిక అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.. రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ. దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. దీని గురించి మాట్లాడుతూ.. ఆసమయంలో నాదగ్గర కథ లేకపోవడంతో అనామిక సినిమా చేశాను. నయనతార లాంటి స్టార్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం.. అయితే నయనతార లాంటి స్టార్‌తో ఆ సినిమా తీయకుండా ఉండాల్సింది. అప్పటికే దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన సంచలనం సృష్టించింది. దాంతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకున్నా.. కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా పడకుండా ఉండాల్సింది అని అన్నారు శేఖర్ కమ్ముల.. ఈ కామెట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. నయన్ ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి