
రీసెంట్‌గా విడుదలైన విడాముయర్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ అంచనాలను నెక్ట్స్ లవెల్‌కు తీసుకెళుతూ మేకర్స్ ఈ మూవీ నుంచి ‘సవదీక’ అనే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను మేకర్స్ శుక్రవారం (డిసెంబర్ 27) రోజున విడుదల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన తనదైన శైలిలో మరో సూపర్బ్ ట్యూన్‌తో సవదీక సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఆంథోని దాసన్ పాడిన ఈ పాటను అరివు రాశారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను, వైవిధ్యమైన చిత్రాలతో యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్ర, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.
కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్నిఅందిస్తుండగా ఓం ప్రకాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా, ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్), గోపీ ప్రసన్న (పబ్లిసిటీ డిజైనర్), హరిహరసుతన్(వి.ఎఫ్.ఎక్స్), సురేష్ చంద్ర (పి.ఆర్.ఒ-తమిల్), నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (పి.ఆర్.ఒ – తెలుగు) సినిమాలో భాగమయ్యారు. అజిత్ కుమార్ ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
కాగా అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)ల అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు. అలాగే విడాముయర్చిలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..