తమిళ్ హీరో కార్తి(Karthi ) కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యారు. యుగానికొక్కడే సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కార్తికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తి నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. దాంతో కార్తి నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కార్తి. ప్రస్తుతం కార్తీ రెండు సినిమాతో రానున్నారు.. అందులో ఒకటి విరుమన్ కాగా మరొకటి సర్ధార్. కార్తి సర్ధార్ సినిమాను హీరో సూర్య జ్యోతిక 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ద్వారా డైరెక్టర్ శంకర్ ముద్దుల తనయ అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయంకాబోతోంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న రిలీజ్కు రెడీగా ఉన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘సర్దార్` రిలీజ్ టైమ్ ని చెప్పేశాడు. కార్తి నటిస్తున్న స్పై థ్రిలర్ ఇది. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాశిఖన్నాతోపాటు `జై భీమ్` ఫేమ్ రజీషా విజయన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రలో ఒకనాటి అందాల తార లైలా కనిపించబోతోంది. దాదాపు 16 ఏళ్ల గ్యాప్ తరువాత లైలా నటిస్తున్న సినిమా ఇది. ఇందులో కార్తి టూ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నారు. “సర్దార్` నుంచి సెకండ్ లుక్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ యంబీషియస్ ప్రాజెక్ట్ తో దీపావాళిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం`అంటూ కార్తి ట్వీట్ చేశారు. దీపావళికి సర్దార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Happy to reveal the second look from #Sardar. Looking forward to celebrating Diwali with this ambitious project.#SardarFromDiwali2022@Psmithran @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash #Laila @ChunkyThePanday @george_dop @AntonyLRuben @lakku76 @Prince_Pictures pic.twitter.com/QocceennS7
— Actor Karthi (@Karthi_Offl) May 24, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :