ఇటీవల 777 చార్లీ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. దీంతో భాషతో సంబంధం లేకుండా రక్షిత్ శెట్టికి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవల అతను ప్రధాన పాత్రలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో చిత్రం కన్నడలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా స్వయంగా నిర్మించాడు. కొద్ది రోజుల క్రితం కన్నడలో విడుదలైన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈమూవీని ఇప్పుడు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక విజువల్ అండ్ మ్యూజికల్ పోయెట్రి అనే ఫీలింగ్ వస్తుంది. అమ్మాయికి సముద్రం అంటే చెప్పలేనంత ఇష్టం. ఊరు వదిలి సిటీ వచ్చిన అమ్మాయి.. అక్కడే ఓ అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వీళ్ల ప్రేమకథకు అడ్డంకి ఏమిటీ ?.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రానికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను సప్త సాగరాలు దాటి అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
Here’s the trailer of #SaptaSagaraluDhaati, Heard so much about this beautiful love story. Can’t wait to watch.
Wishing my dear friend @rakshitshetty & the entire team all the very best for the Telugu release. 🤗https://t.co/D1gLHYLvU0
Experience the epic love story in…
— Nani (@NameisNani) September 19, 2023
ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 22న తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించారు. అవినాశ్, శరత్ లోహితాశ్వ కీలకపాత్రలు పోషించారు.
And here it is! The trailer of #SaptaSagaraluDhaati 🤗🤗
Booking opens now in few theatres, more theatres & Shows will be added from today!!!
Experience the epic love story in theatres from Sep 22nd😍 #SSESideA #SSDSideA@hemanthrao11 @rukminitweets @vishwaprasadtg… https://t.co/PTZGxtkSKX
— People Media Factory (@peoplemediafcy) September 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.