Trailer Talk: రౌడీలకు రామాయణం చెబితే రావణాసురిడినే ఫాలో అవుతారు.. దుమ్ములేపుతున్న బర్నింగ్ స్టార్.
Bazaar Rowdy Trailer: 'హృదయ కాలేయం' చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నారు నటుడు సంపూర్ణేశ్ బాబు. ఈ సినిమాలో తనదైన కామెడీని పండించిన సంపూర్ణేశ్ బాబు..
Bazaar Rowdy Trailer: ‘హృదయ కాలేయం’ చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నారు నటుడు సంపూర్ణేశ్ బాబు. ఈ సినిమాలో తనదైన కామెడీని పండించిన సంపూర్ణేశ్ బాబు ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత కొబ్బిరిమట్ట సినిమాతో పాటు పలు ఇతర చిత్రాల్లోనూ సైడ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఇదిలా ఉంటే తాజాగా బర్నింగ్ స్టార్ హీరోగా బజార్ రౌడి అనే సినిమా తెరకెక్కుతోంది. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ తాజాగా కరోనా నిబంధనలను తొలగిపోవడం, థియేటర్లు తిరిగి ఓపెన్ కావడంతో బజార్ రౌడీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రచారంలో జోరును పెంచింది.
ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో సంపూ తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. కాళి పాత్రలో నట విశ్వరూపాన్ని చూపించారు. ‘వచ్చాడు కాళి.. నాకెదురొచ్చినవాడు ఖాళీ’ అంటూ సంపూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే ట్రైలర్‌లో వచ్చే ‘రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురుడిని ఫాలో అవుతారు కానీ రాముడ్ని కాదు’, ‘నీకు బాంబేలో బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్’ వంటి సంపూ మార్క్ డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇక కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా రొమాంటిక్ సీన్స్‌లోనూ సంపూ ఆకట్టుకున్నాడు. ఇక సినిమా ట్రైలర్‌ను గమనిస్తే సంపూ ఇందులో డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: SR Kalyana Mandapam: ఆహాలో సందడి చేయనున్న ఎస్‌ఆర్. కళ్యాణ మండపం.. ఈ నెలలోనే స్ట్రీమింగ్ మొదలు..?
RGV On Talibans: తాలిబన్లను సైతం వదలని రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు.