దుమ్ము రేపుతోన్న సమంత ‘ఓ బేబీ’ కలెక్షన్స్

దుమ్ము రేపుతోన్న సమంత  ‘ఓ బేబీ’ కలెక్షన్స్

సమంత అక్కినేని..ఈ నటి తెలుగులో స్టార్ హీరోస్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. స్యామ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండటం లేదు. కటౌట్స్, క్రాకర్స్‌తో థియేటర్స్ కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. తాజాగా ‘ఓ బేబీ’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సమంత. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లలతో దూసుకుపోతోంది. సమంత కెరియర్‌లో సోలోగా […]

Ram Naramaneni

|

Jul 06, 2019 | 5:18 PM

సమంత అక్కినేని..ఈ నటి తెలుగులో స్టార్ హీరోస్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. స్యామ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండటం లేదు. కటౌట్స్, క్రాకర్స్‌తో థియేటర్స్ కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. తాజాగా ‘ఓ బేబీ’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సమంత.

శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లలతో దూసుకుపోతోంది. సమంత కెరియర్‌లో సోలోగా అత్యధిక థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ ఆమె కెరియర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది.  23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసిన అక్కినేనివారి కోడలి సరికొత్త ప్రయోగానికి ప్రేక్షకులు ఫుల్ మార్క్స్ వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా.. తొలిరోజు ‘ఓ బేబీ’ దాదాపు కోటి షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఉత్తరాంధ్రలో 21 లక్షలు, వెస్ట్ గోదావరి 6.8 లక్షలు, ఈస్ట్‌లో 8. 5 లక్షలు, క్రిష్ణా, గుంటూరులో 17 లక్షలు, నెల్లూరు 3.5 లక్షలు, సీడెడ్‌లో 12 లక్షలు, నైజాం ఏరియాలో 44 లక్షలు వసూలైంది.  ఇక యూఎస్‌లోనూ మూవీ సత్తా చాటుతోంది. 93 లొకేషన్స్‌లో విడుదలైన ఈ మూవీకి ప్రీమియర్‌ ద్వారా 1, 45, 637 డాలర్లను వసూలు చేసింది. తెలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఇన్ని కలెక్షన్లు రావడంత ఇదే తొలిసారి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ శౌర్య, లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu