AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బాలీవుడ్ క్రిటిక్స్’, ‘ప్రేమ’పై ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అయితే విడుదలకు ముందు ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. అంతేకాదు రిలీజ్ తరువాత ఈ సినిమాపై కొందరు ప్రశంసలు కురిపించినప్పటికీ.. మరికొందరు మాత్రం విమర్శలు కురిపించారు. ఏదేమైనా అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద అద్భుత కలెక్షన్లను సాధించి, విజయ్ దేవరకొండకు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. అంతేకాదు టాలీవుడ్‌ చరిత్రలో తనకంటూ ఒక […]

‘బాలీవుడ్ క్రిటిక్స్’, ‘ప్రేమ’పై ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 10:53 PM

Share

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అయితే విడుదలకు ముందు ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. అంతేకాదు రిలీజ్ తరువాత ఈ సినిమాపై కొందరు ప్రశంసలు కురిపించినప్పటికీ.. మరికొందరు మాత్రం విమర్శలు కురిపించారు. ఏదేమైనా అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద అద్భుత కలెక్షన్లను సాధించి, విజయ్ దేవరకొండకు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. అంతేకాదు టాలీవుడ్‌ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి ఇటీవల విడుదల చేశారు. అందులో షాహిద్ కపూర్, కియారా అద్వాణీ జంటగా నటించగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాకు అక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఫెమినిస్ట్‌లు ఈ సినిమాపై తిట్టిపడేశారు. మహిళల మనోభావాలను కించపరిచేలా, మహిళలపై లైంగిక వేధింపులు ప్రోత్సహించేలా కొన్ని సీన్లు ఉన్నాయంటూ వారు కామెంట్లు చేశారు. అయినప్పటికీ అక్కడ కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు 218కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్‌లో ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో.. త్వరలో 300కోట్లను కొల్లగొట్టి.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ కామెంట్లపై.. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ను కొట్టే సన్నివేశంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘ఒకవేళ మనం ఎవరినైనా గాఢంగా ప్రేమించి వారితో రిలేషన్‌లో ఉన్నప్పుడు.. ఆ అమ్మాయిని ఇష్టమైన చోట పట్టుకునేంత బంధం, ముద్దు పెట్టుకునే ప్రేమ, ఒకరినొకరు కొట్టుకునేంత స్వేచ్ఛ కూడా లేకపోతే.. ఆ బంధంలో అర్థం కనిపించదు’’ అని సందీప్ పేర్కొన్నాడు. ‘‘ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి నిజమైన ప్రేమ గురించి తెలీదేమో. సినిమాపై అలా మాట్లాడే ఫెమినిస్ట్‌లు వారి సైడ్ నుంచి మాత్రమే ఆలోచిస్తారు’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ 2స్టార్లు ఇవ్వడంపై కూడా ఆయన స్పందించారు. ‘‘లావుగా ఉన్న ఓ క్రిటిక్(రాజీవ్ మసంద్‌ను ఉద్దేశించి) నా సినిమాకు 2స్టార్ల రేటింగ్ మాత్రమే ఇచ్చారు కానీ ప్రేక్షకులు మాత్రం 200కోట్లను ఇచ్చారు. ఇక అతనే కొన్ని స్టుపిడ్ సినిమాలకు మూడు స్టార్లు ఇచ్చాడు’’ అని వెల్లడించాడు. ఈ సందర్భంగా సంజు మూవీని ఉదాహరణగా చూపించిన సందీప్ రెడ్డి.. అందులో కొన్ని అసభ్యకర డైలాగ్‌లు ఉంటే క్రిటిక్స్ వాటికి విజిల్స్ వేసి మరీ జై కొట్టారు అని చెప్పుకొచ్చాడు. అయితే సందీప్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై నెటిజన్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నారు. కొందరేమో సందీప్ రెడ్డి వంగాకు మద్దతుగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరమే అతడికి కొంచెం కూడా సిగ్గు లేదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Follow Us
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..