Samantha: విడాకులపై మరోసారి స్పందించిన సమంత ?.. కాఫీ విత్ కరణ్ షోలో సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Jun 21, 2022 | 3:46 PM

అమ్మాయిలపై ఏవైనా పుకార్లు వస్తే అవి కచ్చితంగా నిజమని నమ్ముతారు. అదే అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం, వాటిని అమ్మాయి చేయించింది అంటారు.

Samantha: విడాకులపై మరోసారి స్పందించిన సమంత ?.. కాఫీ విత్ కరణ్ షోలో సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Samantha
Follow us on

సమంత.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. విడాకుల అనంతరం సామ్ స్పీడ్ పెంచింది. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది (Samantha). ఓవైపు తెలుగులోనే కాకుండా తమిళంలోనూ సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే విడాకుల ప్రకటన అనంతరం సామ్ పేరు నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సామ్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగానే సమాధానాలు ఇస్తుంది సామ్.. ఇక తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది సామ్.. ‘అమ్మాయిలపై ఏవైనా పుకార్లు వస్తే అవి కచ్చితంగా నిజమని నమ్ముతారు. అదే అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం, వాటిని అమ్మాయి చేయించింది అంటారు. ఇప్పటికైనా ఎదగండి. మేము పాత జ్ఞాపకాలను మరిచిపోయి మూవ్‌ ఆన్‌ అవుతున్నాం. మీరు కూడా ముందుకువెళ్లండి. మీరు చేస్తున్న పనిపై, మీ కుటుంబాలపై దృష్టిసారించండి’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇప్పుడు సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. గత కొద్ది రోజుల క్రితం సామ్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సంగతి తెలిసిందే. కాతువాకుల రెండు కాదల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా సామ్ ఆ షోలో పాల్గోంది.. ఈ క్రమంలో ఆ షోలో సామ్ విడాకులపై మరోసారి స్పందించిందని.. అందుకు గల కారణాలను సామ్ చెప్పినట్లుగా వార్తలు బీటౌన్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జూలై 7న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో స్ట్రీమింగ్ కానుంది. మరి నిజంగానే సామ్ తన విడాకుల పై స్పందించిందా ? లేదా ? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సమంత.. యశోద, ఖుషి సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.