AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu: సామ్ కష్టం చూస్తే సలాం చేయాల్సిందే.. చేతికి సెలైన్ టేప్‌తోనే..

సమంత గురించి తెలియని వాళ్లు పెద్దగా ఉండరేమో.. ప్రస్తుతం సమంత ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా అందరికి తెలిసే ఉంటుంది.

Samantha Ruth Prabhu: సామ్ కష్టం చూస్తే సలాం చేయాల్సిందే.. చేతికి సెలైన్ టేప్‌తోనే..
Samantha
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2022 | 5:01 PM

Share

సమంత.. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పేరు తెగ వినిపిస్తోంది. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ చిన్నది. ఇప్పుడు వరుస ఆ సినిమాలతో బిజీ అయ్యింది. సమంత గురించి తెలియని వాళ్లు పెద్దగా ఉండరేమో.. ప్రస్తుతం సమంత ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా అందరికి తెలిసే ఉంటుంది. సినిమాలంటే ఎంతో డెడికేషన్ తో పని చేసే సామ్ రీసెంట్ గా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. సమంత అరుదైన మయోసైటిస్ డిసీజ్‌ తో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కండరాలు బలహీనంగా అవుతాయి. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది సమంత. సామ్ అనారోగ్యానికి గురైందని తెలిసిన దగ్గర నుంచి ఆమె అభిమానులు ఆందోళనపడుతున్నారు. త్వరగా కోలుకుంటావ్ సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సమంత కూడా అనారోగ్యం కారణంగా అధైర్య పడలేదు.. తాను ఫైట్ చేస్తున్నా అని చెప్పింది.

ఈ రీసెంట్ గా యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. సామ్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.. తాను చావలేదు.. ఫైట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఒకొక్కసారి మరో అడుగు వేస్తే బాగుండు అని అనిపించేది అని.. కొన్నిసార్లు ఇక్కడి వరకు రాగలిగాను అని అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యింది. ఇక సామ్ ఎంతో డెడికేషన్ తో సినిమాను కంప్లీట్ చేసిందని యశోద టీమ్ కూడా తెలిపారు.

ఇవి కూడా చదవండి

తాజాగా తాను జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది సామ్. ఆరోగ్యం బాలేకున్నా సామ్ పడుతున్న కష్టాన్ని చూసి అభిమానులు, నెటిజన్లు చలించి పోతున్నారు. చేతికి సెలైన్ టేప్ తోనే జిమ్ లో చమట్లు చిందిస్తుంది సామ్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం