
టాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. తన సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన శుభం చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది సామ్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే ఈ మూవీకి మంచి వసూళ్లు రాబట్టింది. ముందు నుంచి ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సామ్.. ప్రస్తుతం శుభం సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల తన సోషల్ మీడియాలో శుభం సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. అందులో దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోస్ తెగ వైరలయ్యాయి. దీంతో వీరిద్దరి డేటింగ్ అంటూ ప్రచారం మొదలైంది. త్వరలోనే సామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందని.. వీరిద్దరు తమ పెళ్లి విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారంటూ నెట్టంట రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్స్ పై సామ్, రాజ్ ఇద్దరూ మౌనంగానే ఉన్నారు.
తాజాగా సామ్ గురించి వస్తున్న రూమర్స్ పై సమంత మేనేజర్ స్పందించారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని, సామ్, రాజ్ డేటింగ్ వార్తలలో ఎలాంటి నిజం లేదని, కేవలం శుభం సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన ఫోటోలను ఇలా అసత్య వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని అన్నారు. ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. దీంతో ఇప్పుడు సామ్, రాజ్ డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం సామ్ నిర్మాతగా తన తొలి సినిమా సక్సెస్ కావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శుభం చిత్రానికి డైరెక్టర్ రాజ్ క్రియేటివ్ ప్రొడ్యుసర్ గా వ్యవహరించారు. దీంతో ఇద్దరూ కలిసి ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సమంత ఇప్పుడిప్పుడే తన కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సామ్ ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..