మయోసైటిస్ నుంచి కోలుకున్నాక సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా ఉంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ ఏడాది ఆమె నటించిన శాకుంతలం ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చేయడానికి వస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ సామ్ నటిస్తోంది. ఈ సిరీస్ కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇలా షూటింగులతో బిజీగా ఉంటోన్న సమంత సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తన లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను అందులో పంచుకుంటోంది. ఇక నాగచైతన్యనతో విడాకులు తీసుకున్న తర్వాత తరచూ మోటివేషనల్ కోట్స్‌ను షేర్ చేస్తోంది సమంత. ఇవి ఒక్కోసారి తీవ్ర ఆలోచనలు, చర్చకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది సమంత. ‘మరణం నుంచి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు, కనీసం ప్రేమతో అయినా మన జీవితాన్ని కాపాడుకోవాలి’ అని చిలీ రచయిత ఫాబ్లో నెరుడా కోట్ ను పోస్ట్ చేసింది సామ్.
దీనిపై స్పందిస్తోన్న నెటిజన్లు ‘సమంత ఎందుకీ పోస్ట్ పెట్టింది. మళ్లీ ప్రేమలో కానీ పడిందా? ‘ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తోన్నఖుషి సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. శివనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ‘నా రోజా నువ్వే’ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..