వెంకీ కుమార్తె పెళ్లి వేడుకల్లో సల్మాన్ సందడి
హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని హరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత వివాహం చేసుకోబోతుంది. వీరిద్దరి వివాహానికి సంబంధించిన వేడుకలు జైపూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. దగ్గుబాటి కుటుంబసభ్యులతో పాటు అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య, సమంత తదితరులు వివాహ వేడుకల్లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా అశ్రిత వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. […]

హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని హరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత వివాహం చేసుకోబోతుంది. వీరిద్దరి వివాహానికి సంబంధించిన వేడుకలు జైపూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. దగ్గుబాటి కుటుంబసభ్యులతో పాటు అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య, సమంత తదితరులు వివాహ వేడుకల్లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా అశ్రిత వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా వెంకటేశ్‌తో సల్మాన్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే వెంకీ కుమార్తె వివాహానికి సల్మాన్ వెళ్లినట్లు సమాచారం. ఆయనతో పాటు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు బీనా కాక్ కూడా అశ్రిత వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జైపూర్‌లో వివాహం తరువాత హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.