Salaar vs Fighter: బాక్సాఫీస్‌ వద్ద క్రేజీ క్లాష్‌.. ఒకే రోజు రిలీజ్‌ కానున్న ప్రభాస్‌, హృతిక్‌ సినిమాలు!

సెప్టెంబర్‌ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్‌ను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇదే రోజు మరో బాలీవుడ్ భారీ చిత్రం బాక్సాఫీస్‌ బరిలోకి దిగనుంది. అదే హృతిక్‌ రోషన్‌ (HrithiK Roshan) నటిస్తోన్న ఫైటర్‌.

Salaar vs Fighter: బాక్సాఫీస్‌ వద్ద క్రేజీ క్లాష్‌.. ఒకే రోజు రిలీజ్‌ కానున్న ప్రభాస్‌, హృతిక్‌ సినిమాలు!
Salaar Vs Fighter

Updated on: Aug 17, 2022 | 7:44 PM

Tollywood:టాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం సలార్‌. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) పాన్‌ ఇండియా స్థాయిలో ఈ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజైంది. ఇందులో​ రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఇంటెన్సివ్‌ లుక్‌లో అదరగొట్టాడు రెబల్‌ స్టార్‌. దీంతో పాటు ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ఖరారైంది. సెప్టెంబర్‌ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్‌ను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇదే రోజు మరో బాలీవుడ్ భారీ చిత్రం బాక్సాఫీస్‌ బరిలోకి దిగనుంది. అదే హృతిక్‌ రోషన్‌ (HrithiK Roshan) నటిస్తోన్న ఫైటర్‌. గతంలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు.

కాగా ఫైటర్‌ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్‌ కపూర్‌ కీ రోల్‌ పోషిస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటీనటులు ఈ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారని తెలుస్తోంది. కాగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ సలార్‌ బడ్జెట్‌ కూడా రూ.200 కోట్లకు పైగానే. అయితే హృతిక్‌ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్‌ మీదకు రానుంది. మరోవైపు సలార్‌ టీం ఇప్పటికే షూటింగ్‌లో బిజీగా ఉంటోంది. మరి ఈ రెండు భారీ యాక్షన్‌ సినిమాలు ఒకేరోజు తలపడడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దీనిపైనే చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..